శోభా శెట్టి ఎలిమినేట్‌.. ఆమె నిజ స్వరూపం బయటపెట్టిన నాగార్జున..

Published : Dec 09, 2023, 07:14 PM ISTUpdated : Dec 09, 2023, 09:15 PM IST
శోభా శెట్టి ఎలిమినేట్‌.. ఆమె నిజ స్వరూపం బయటపెట్టిన నాగార్జున..

సారాంశం

బిగ్‌ బాస్‌ లేడీ కంటెస్టెంట్‌ శోభా శెట్టి అసలు రూపాన్ని బయటపెట్టాడు హోస్ట్ నాగార్జున. అంతేకాదు ఈ వారం ఆమెని ఇంటి నుంచి కూడా పంపిస్తున్నారని తెలుస్తుంది.   

బిగ్‌ బాస్‌ తెలుగు 7లో చివరి వారానికి చేరింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తుంది. మరో వారంతో ఈ షో ముగుస్తుంది. ఇక బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఈ వారమే చివరి ఎలిమినేషన్‌ కాబోతుంది. మిగిలిన వాళ్లు ఫైనల్‌కి వెళ్లబోతున్నారు. అయితే ఇందులో ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారా? లేక ఒక్కరే ఉండబోతున్నారా? అనేది ఆసక్తికరం. అయితే ఈ సారి సూపర్‌ సెవెన్‌ ఉండబోతున్నారని సమాచారం.  ఇప్పుడు హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. వారిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్‌ అయితే ఇక ఆరుగురు ఉంటారు. మరి సూపర్‌ సెవెన్‌ ఉండాలంటే ఈ వారం ఎలిమినేషన్‌ ఉండకూడదు. ఒకవేళ టాప్‌ 5 ఉంటే ఈ వారం ఇద్దరు ఎలిమినేట్‌ కావాల్సి ఉంటుంది.

అయితే ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు.. లేడీ కంటెస్టెంట్‌ శోభా శెట్టి ఈ వారం ఎలిమినేట్‌ కాబోతుందట. మిగిలిన కంటెస్టెంట్లు సేఫ్‌ కాగా, చివరగా యావర్‌, శోభా శెట్టి మిగిలారు. వీరిలో శోభా శెట్టి అతితక్కువ ఓట్లతో ఎలిమినేట్‌ అయ్యిందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగ్‌ వచ్చి హౌజ్‌మేట్స్ నిజస్వరూపాలను బయటపెట్టారు. ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎంతగా ఓవర్‌ చేస్తున్నారనే విషయాలను వెల్లడించారు. వారిని నిలదీయడంతోపాటు కడిగిపడేశాడు. వారి డ్రామాలను అందరికి తెలిసేలా చేశాడు. అందులో భాగంగా శోభా శెట్టి నిజ స్వరూపం బయటపెట్టాడు నాగ్‌. ఆమె ప్రతి సారి సెంటిమెంట్‌, ఎమోషన్స్ తో ట్రాప్‌ చేస్తూ వచ్చింది. కొందరిని టార్గెట్ చేస్తూ సింపతి పొందే ప్రయత్నం చేస్తుంది. ఈక్రమంలో ఈ వారంలో ఆటలో ఆమె యావర్‌.. తనని కొట్టాడనే విషయంలో ఆరోపణలు చేసింది. 

దీనికి నాగ్‌ నిలదీయగా, ఆమె అలా అనలేదని ఆమె చెప్పింది. వీడియో చూపించగా, తాను చాలా డిస్టర్బ్ అయ్యానని ఆమె చెప్పడం గమనార్హం. ఆమెలోని అనేక యాంగిల్స్ ని బయటకు తీశాడు నాగ్‌ దీంతో నోరెళ్లబెట్టిన పరిస్థితి ఎదురయ్యింది. అంతేకాదు యావర్‌ ని కూడా నాగ్‌ ఆడుకున్నాడు. ఆయన వీడియోలు చూపించి `ఛీ ఛీ` అంటూ నీచంగా మాట్లాడిన వ్యాఖ్యలు వీడియో చూపించి నిలదీశాడు. స్ట్రాంగ్ గా క్లాస్‌ పీకాడు. వీరినే కాదు, అమర్‌ దీప్‌, ఇక ఇతర కంటెస్టెంట్లని కూడా నాగ్‌ నిలదీశాడు. అయితే ఈ సారి ఆయన డోస్‌ గట్టిగానే ఇవ్వడం విశేషం. 

Read more: ఫినాలేకి ముందు అమర్ కి షాక్... రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపేసిన నాగార్జున?

Also read: పల్లవి ప్రశాంత్ ని ఓడించేందుకు కుట్ర... ఓట్లు పడకుండా అలా చేస్తున్నారా?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?