ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చాలంటే.. ఏకంగా టీవీనే గిఫ్ట్ గా పొందాడు

Published : Sep 19, 2020, 07:53 PM IST
ఐపీఎల్‌ టైమింగ్‌ మార్చాలంటే.. ఏకంగా టీవీనే గిఫ్ట్ గా పొందాడు

సారాంశం

సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి దీనిపై స్టార్‌మా స్పందించింది. సెప్టెంబర్‌3న ట్వీట్‌ పెట్టాడు. ఇది వైరల్‌ అయ్యింది. ఆయన బాధని అర్థం చేసుకున్న స్టార్ మా స్పందించింది. ఆయన చెప్పింది నిజమే అని తెలిపింది.

ఇటీవల 7.30గంటలకు `కార్తీకదీపం` సీరియల్‌ ఉంది, మా ఫ్యామిలీ అంతా కలిసి ఆ సీరియల్‌ చూస్తాం. అందుకోసం కాస్త ఐపీఎల్‌ మ్యాచ్‌ టైమ్‌ని మార్చాలని పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీకి ట్వీట్‌పెట్టి పాపులరైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ని `కార్తీకదీపం` సీరియల్‌ టీమ్‌ సర్ప్రైజ్‌ చేసింది.  

సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి దీనిపై స్టార్‌మా స్పందించింది. సెప్టెంబర్‌3న ట్వీట్‌ పెట్టాడు. ఇది వైరల్‌ అయ్యింది. ఆయన బాధని అర్థం చేసుకున్న స్టార్ మా స్పందించింది. ఆయన చెప్పింది నిజమే అని తెలిపింది. అయితే ఇందులో `వంటలక్క` పాత్ర ధారి ప్రేమి విశ్వనాథ్‌ డిఫరెంట్‌గా స్పందించింది.ఆయనకు ప్రత్యేకంగా 32 ఇంచెస్‌ టీవీని గిఫ్ట్ గా పంపించింది. ఒక ఉత్తరాన్ని కూడా పంపింది. ఈ ఊహించని గిఫ్ట్ తో శివచరణ్‌ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 

ఫ్యామిలీలో కొన్ని సీరియల్స్ కి విపరీతమైన అభిమానం ఉంటుంది. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్‌ కారు. మహిళలైతే వాటి కో్సం గొడవలు కూడా పడుతుంటారు. ఆ సీరియల్స్ లో వేరే ఛానెల్స్ చూసేందుకు ఇష్టపడరు. ఒకవేళ అలాంటిదే జరిగితే అది పెద్ద గొడవే. దీంతో ఈ విషయాన్ని తక్కువ చేయలేం. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న వంటలక్క తన అభిమానిని సర్‌ప్రైజ్‌ చేసి ఆకట్టుకుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే