రాజ్ కుంద్ర సంచలన ప్రకటన, శిల్పా శెట్టితో విడాకులు తీసుకోబోతున్నారా..?

By Mahesh Jujjuri  |  First Published Oct 20, 2023, 2:13 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి విడాకులు తీసుకోబోతుందా..? రాజ్ కుంద్రాతో ఆమెకు మనస్పర్ధలు వచ్చాయా..? రాజ్ కుంద్రా సోషల్ మీడియా వేధికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకీ ఆయన ఏం చెప్పారు. 


ఈమధ్య ఫోర్నోగ్రఫీ కేసులో ఇబ్బందులు ఫేస్ చేశారు.. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర. అప్పటి నుంచి ఆయన బయటకు రావడానికి కూడా మాస్క్ తో వస్తున్నాడు. అయితే ఫోర్నోగ్రాఫీ కేసులో బెయిల్ పై వచ్చిన రాజ్ కుంద్రకు.. శిల్పా శెట్టికి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ చాలా కాలంగా న్యూస్ వినిపిస్తూనే ఉంది. 

అంత కాదు వీరు విడాకులు తీసుకోబోతున్నట్టు గతంలోనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవి రూమర్స్ గానేమిగిలిపోయాయి. తాజాగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు రాజ్ కుంద్రా. తాజాగా  ఆయన సంచలన ప్రకటన చేశాడు. శిల్పా శెట్టి, తాను విడిపోయామని సోషల్ మీడియాలో  వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.  రాజ్‌ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి పేరును ప్రస్తావించకుండా.. ‘మేము విడిపోతున్నాం. ఈ కష్టకాలంలో మాకు అండగా ఉండాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా’ అంటూ పోస్టు చేశారు. ఈ పోస్ట్‌కు హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జోడించారు. అయితే, శిల్పా శెట్టి మాత్రం ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. రాజ్‌ కుంద్రా పోస్ట్‌ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Latest Videos

 

We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔

— Raj Kundra (@onlyrajkundra)

రాజ్‌కుంద్రా నటించిన యూటీ 69 మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.పోర్నోగ్రఫీ కేసులో గతేడాది నవంబర్‌లో అరెస్టు తరువాత రాజ్‌కుంద్రా బెయిల్‌పై విడుదలయ్యారు.  నాటి నుంచి అతడు మాస్కు పెట్టుకునే మీడియా ముందుకు రావడం మొదలెట్టాడు. అయితే, త్వరలో తన సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో బుధవారమే మాస్క్ కు స్వస్తి చెప్పి.. రాజ్‌ కుంద్రా  మాస్కు లేకుండా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. అతను అలా రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. 

 

కాగా, రాజ్‌ కుంద్రా జీవితంలోని కాంట్రవర్సీలే నేపథ్యంగా రూపొందిన ‘యూటీ 69’ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది.తన బయోపిక్ లో తానే హీరోగా నటించాడు రాజ్ కుంద్రా. ఈ సినిమాను షానవాజ్ అలీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా.. SVS స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 

click me!