శ్రీ‌వాస్ చేతుల‌మీదుగా `శేఖరం గారి అబ్బాయ్` మోష‌న్ పోస్ట‌ర్‌

Published : Mar 30, 2017, 07:44 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
శ్రీ‌వాస్ చేతుల‌మీదుగా `శేఖరం గారి అబ్బాయ్` మోష‌న్ పోస్ట‌ర్‌

సారాంశం

 హీరోయిన్ అక్షత దర్శకత్వంలో `శేఖరం గారి అబ్బాయ్` విన్ను మద్దిపాటి, అక్షత హీరో హీరోయిన్లుగా మూవీ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేసిన ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్

అచీవర్స్ సిగ్నేచర్ ఎమ్.ఎఫ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై  హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. విన్ను మద్దిపాటి, అక్షత నాయ‌కానాయిక‌లు. ఇటీవ‌ల‌ కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు లాంచ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ని ప్ర‌ముఖ దర్శ‌కులు శ్రీ‌వాస్ ఆవిష్క‌రించారు. 

 

ఈ సంద‌ర్భంగా శ్రీ‌వాస్ మాట్లాడుతూ -``ద‌ర్శ‌కురాలు, క‌థానాయిక అక్ష‌త‌కు గుడ్ ల‌క్‌. మంచి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది విజ‌య‌వంతంగా ముందుకు సాగాలి. మునుముందు మ‌రిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలి. చిత్ర‌యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 

 

దర్శకురాలు, క‌థానాయిక‌ అక్షత మాట్లాడుతూ ``అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు. సూప‌ర్‌డూప‌ర్ హిట్ ఇచ్చిన ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు. అలాగే మోహ‌న్‌బాబు గారు ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేసి ఆశీస్సులు అందించారు. పెద్ద‌ల ఆశీస్సులు మాకు కావాలి. ఈ సినిమాతో ప‌రిచ‌యం అవుతున్న కొత్త‌వారికి, స్ట్ర‌గ్లింగ్ ఆర్టిస్టులు అంద‌రికీ మంచి జ‌ర‌గాలి`` అన్నారు. 

 

హీరో విన్ను మాట్లాడుతూ-`ల‌క్ష్యం, డిక్టేట‌ర్ లాంటి పెద్ద విజ‌యాలు ఇచ్చిన శ్రీ‌వాస్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేయ‌డం వ‌రంలా భావిస్తున్నా. పెద్ద‌ల ఆశీస్సులు ఉత్సాహాన్నిచ్చాయి. పెద్ద విజ‌యం అందుకుంటాం. అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు`` అన్నారు. 

 

నిర్మాత మద్దిపాటి సోమశేఖర రావు మాట్లాడుతూ ``టాకీ పూర్త‌యింది. ఫ‌స్ట్‌లుక్ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. మోష‌న్ పోస్ట‌ర్ అంద‌రికీ న‌చ్చింది. త్వ‌ర‌లోనే పాటలు రిలీజ్ చేస్తాం`` అన్నారు. 

 

కార్యక్రమంలో సూర్య, అనురూప్ ,డి.ఎం.కె , సంగీత దర్శకుడు సాయి ఎలేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి ఎలెందర్, కెమెరా: రాఘవ,  కూర్పు: నందమూరి హరి.

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు