పెళ్లి డేట్‌ ఫిక్స్ చేసుకున్న శర్వానంద్‌.. రాయల్‌ వెడ్డింగ్‌.. అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Published : May 17, 2023, 10:41 AM ISTUpdated : May 17, 2023, 11:50 AM IST
పెళ్లి డేట్‌ ఫిక్స్ చేసుకున్న శర్వానంద్‌.. రాయల్‌ వెడ్డింగ్‌.. అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

సారాంశం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఆయన ఇప్పటికే ఎంగేజ్‌మెంట్స్ చేసుకోగా, అది క్యాన్సిల్‌ అంటూ రూమర్స్ వచ్చాయి. దీంతో ఇప్పుడు మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ చేసుకున్నారు.

యంగ్‌ హీరో శర్వానంద్‌ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆయనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మదుసూదన్‌ రెడ్డి కుమార్తె, రక్షితారెడ్డితో జనవరిలో శర్వా నిశ్చితార్థం జరిగింది. అయితే ఇటీవల ఈ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌ అయ్యిందంటూ పుకార్లు ఊపందుకున్నాయి. ఎంగేజ్‌మెంట్‌ జరిగి నాలుగు నెలలు పూర్తి కావస్తున్నసందర్భంగా ఇప్పటికీ ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో వీరు ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారేమో అనే రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, మ్యారేజ్‌ కి సంబంధించి ఇద్దరు హ్యాపీగానే ఉన్నారని, శర్వా సినిమాలతో బిజీ కారణంగా డిలే అయ్యిందని చెప్పుకొచ్చారు. 

తాజాగా పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు అప్‌ డేట్‌ ఇచ్చారు. మ్యారేజ్‌ డేట్‌ని ఫిక్స్ చేసుకున్నారు. జూన్‌ 3న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. జూన్‌ 2, 3 తేదీల్లో రాజస్థాన్‌లోని జైపూర్‌ లో గల లీలా ప్యాలెస్‌లో చాలా గ్రాండియర్‌గా తమ వివాహం జరుపుకోబోతున్నట్టు శర్వా టీమ్‌, కుటుంబ సభ్యులు వెల్లడించారు.  అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభించినట్టు సమాచారం. వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ కూడా ప్రారంభమైందట. జూన్‌ 2న మెహందీ వేడుక, మూడున పెళ్లి వేడుక నిర్వహించనున్నారట. రాత్రి11 గంటలకు శర్వానంద్‌, రక్షితాల మ్యారేజ్‌ జరగనుందని తెలిపారు. రాయల్‌ లుక్‌లో వీరి వివాహం ప్లాన్‌ చేసినట్టు సమాచారం. సినిమా సెలబ్రిటీలు, ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఇందులో పాల్గొనబోతున్నారు.

శర్వానంద్‌ చేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి యూఎస్‌లో సాఫ్ట్ వేర్‌గా పని చేస్తుందని సమాచారం. ఇక జనవరి ఎండింగ్‌లో జరిగిన శర్వా, రక్షితారెడ్డి ఎంగేజ్‌మెంట్‌కి చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌, ఉపాసన, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, నాగచైతన్య, అఖిల్‌, అమల, దిల్‌రాజుతోపాటు నిర్మాతలు పాల్గొని కాబోయే జంటని ఆశీర్వదించారు. ప్రస్తుతం శర్వానంద్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్యతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుందని, ఇటీవలే నలభై రోజులపాటు లండన్‌లో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుని వచ్చారని సమాచారం. దీంతో ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారట.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు