గెట్ రెడీ... జర్నీ సినిమాతో మరోసారి భయపెట్టబోతున్న మేకర్స్..

By Mahesh JujjuriFirst Published Feb 11, 2024, 11:17 PM IST
Highlights

 మరోసారి భయపెట్టడానికి  రెడీ అవుతోంది జర్నీ సినిమా. థియేటర్ లో యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ ను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈమూవీ.. రీ రిలీజ్ కాబోతోంది. 

ప్రస్తుతం  రీరిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు హిట్అయినా కాకపోయినా.. అప్పట్లో ట్రెండ్ క్రిమేట్ చేసిన మూవీస్ ను రీరిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నారు.అంతే కాదు.. అంతే కాదు.. రీరిలీజ్ వల్ల మంచి కలెక్షన్లు కూడా సాధిస్తూ.. మరోసారి ఖాతాలో డబ్బులేసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇలా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని సినినిమాలు తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి రిరిలీజ్ కాబోతున్నాయి.

తమిళ హీరో జై,  తెలుగు యంగ్ హీరో శర్వానంద్, అంజలి, అనన్య ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ ఎం. శరవణన్ దర్శకత్వం  తెరకెక్కంచిన మూవీ జర్నీ.  రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా జర్నీ రూపొందింది. 2011 లో  థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను కట్టిపడేసిన ఈసినిమా. అయితే ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా రీ రిలీజ్ కి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. 

Latest Videos

జర్నీ మూవీ మార్చ్ లో రీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.AR మురుగదాస్ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ లపై AR మురుగదాస్ మరియు ఫాక్స్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి సీ. సత్య సంగీతం అందించారు. ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు రీ రిలీజ్ లకి రెస్పాన్స్ అంతగా ఉండటం లేదు. మరి ఈ జర్నీ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో 

click me!