“బాబ్” అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్. ఇప్పటికే లండన్ లో చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ టైటిల్ జనాల్లోకి వెళ్లటం కష్టమని దర్శక,నిర్మాతలు నిర్ణయానికి వచ్చారని సమాచారం.
టైటిలే చాలా వరకు సినిమాపై జనాల దృష్టి పడేలా చేస్తుంది. ముఖ్యంగా శర్వానంద్ వంటి హీరో ల సినిమాలకు మంచి టైటిల్, జనాల్లోకి వెళ్లేది అత్యవసరం. అందుకు తగ్గ కసరత్తు దర్శకులు చేస్తూంటారు. కానీ చాలా సార్లు బోల్తా పడుతూంటారు. శర్వానంద్ (Sharwanand) హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సినిమా అది. 'భలే మంచి రోజు'తో దర్శకుడిగా పరిచయమై... ఆ తర్వాత 'శమంతక మణి', 'దేవదాస్', 'హీరో' చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్. హీరోగా శర్వానంద్ 35వ చిత్రమిది.
ఈ సినిమాకు ‘బేబీ ఆన్ బోర్డ్’ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో శర్వా ఓ చిన్న పాపకు త్రండిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ పాప చుట్టూ ఈ కథ నడుస్తుంది అని టాక్.“బాబ్” అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్. ఇప్పటికే లండన్ లో చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ టైటిల్ జనాల్లోకి వెళ్లటం కష్టమని దర్శక,నిర్మాతలు నిర్ణయానికి వచ్చారని సమాచారం. అందుకే తాజాగా మరో టైటిల్ తో దర్శకుడు వచ్చాడని ఈ టైటిల్ నే ఫైనల్ చేసారని తెలుస్తోంది. ఆ టైటిల్ ఏమిటంటే... “మనమే”.త్వరలోనే ఈ టైటిల్ ఎనౌన్సమెంట్ జరిగే అవకాసం ఉంది.
హీరో శర్వానంద్ తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వాకి సరైన హిట్ పడి చాలా కాలం అవుతుంది. రీసెంట్‌గా వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా మంచి టాక్‌ని సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద అంతగా వర్కవుట్ కాలేదు. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు చేసిన కొన్ని చిత్రాలు కూడా సోసోగా భాక్సాఫీస్ దగ్గర ఆగిపోయాయి. మరో వైపు ఇండస్ట్రీలో యంగ్ హీరోల పోటీ బాగా పెరిగిపోతున్న దశలో.. శర్వా నిలబడాలంటే.. కచ్చితంగా హిట్ కొట్టాలి. మరి ఆ హిట్ ఈ మనమే ఇస్తుందేమో చూడాలి.