పవన్‌ సినిమాలో ఆఫర్‌ దక్కించుకున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ.. ఎమోషనల్‌ నోట్‌..

శుభ శ్రీ.. అనూహ్యంగా ఐదో వారంలో ఆమె బిగ్‌ బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ సినిమా ఆఫర్‌ని దక్కించుకుంది. ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. 

Google News Follow Us

చాలా మంది సినీ ప్రియులకు, సినిమాల్లోకి రావాలనుకునే వారికి పవన్‌ తో పనిచేయాలని కలలు కంటుంటారు. అలాంటి అవకాశం రావడం చాలా అరుదు. వస్తే ఆ ఆనందానికి అవదులు ఉండవని చెప్పొచ్చు. అలాంటి ఆనందంలో ఉంది బిగ్‌ బాస్‌ బ్యూటీ శుభ శ్రీ రాయగురు. ఆమె ఇటీవల `బిగ్‌ బాస్‌ తెలుగు 7` షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కూల్‌ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంటుంది. హాట్‌ అందాలతో అలరించింది. 

అనూహ్యంగా ఐదో వారంలో ఆమె బిగ్‌ బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ సినిమా ఆఫర్‌ని దక్కించుకుంది. ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. పవర్‌ స్టార్‌ హీరోగా రూపొందుతున్న `ఓజీ`లో ఆమెకి నటించే అవకాశం రావడం విశేషం. ఈ విషయాన్ని శుభ శ్రీ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. దర్శకుడు సుజిత్‌తో కలిసి దిగిన ఫోటోని పంచుకుంటూ తన సంతోషాన్ని వెల్లడించింది. 

పవన్‌ కళ్యాణ్‌తో కలిసి `ఓజీ` మూవీలో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపింది శుభ శ్రీ. తాను పక్కా పవర్‌ స్టార్‌ ఫ్యాన్‌ ని అని, తాను చాలా సంతోషంగా ఉందని తెలిపింది. నా టాలెంట్‌ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన సుజీత్‌,  కెమెరామెన్‌ రవిచంద్రన్‌, డీవీవీ దానయ్యలకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇంతగా తనని ఎంకరేజ్‌ చేస్తున్న ఆడియెన్స్ కి థ్యాంక్స్ చెప్పింది శుభ శ్రీ. 

శుభ శ్రీ `బిగ్‌ బాస్‌ తెలుగు 7`లో.. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా రాణించింది. ఆమె ఆట తీరు అందరిని ఆకట్టుకుంది. తాను ఆటలో పుంజుకుంటున్న సమయంలోనే అనూహ్యంగా ఎలిమినేట్‌ అయ్యింది. అయితే ఇప్పుడు పవన్‌ సినిమాలో ఛాన్స్ రావడంతో,  ఏం జరిగినా మన మంచికే అని అభినందిస్తున్నారు ఫ్యాన్స్. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on