
" శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందం గా ప్రతిబింబించింది. ఇప్పుడు శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. మా బ్యానర్ కి బొమ్మరిల్లు సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం అంతటి పేరు ను తెస్తుంది అని నమ్మకం ఉంది", అని దిల్ రాజు తెలిపారు.
హైదరాబాద్ మరియు గోదావరి జిల్లాల పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సతీష్ వేగేశ్న , ఎడిటింగ్ మధు , సినిమాటోగ్రఫి సమీర్ రెడ్డి, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్