
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli)) రూపొందించిన వండర్ `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. ఈ సినిమా శుక్రవారం విడుదలై సంచలనాలు సృష్టిస్తుంది. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఏకంగా రూ.223కోట్లు వసూలు చేసి సరికొత్త ఇండియన్ రికార్డు లను తిరగరాసింది. ఇప్పటి వరకు 150 కోట్లతో `బాహుబలి 2`పేరుతో ఉన్న రికార్డులను `ఆర్‌ఆర్‌ఆర్` బ్రేక్ చేసింది. సరికొత్త సంచలనాల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాకి కొంత నెగటివ్ టాక్ వచ్చినా, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల అద్భుత నటన, యాక్షన్‌తో అవన్నీ పక్కకు వెళ్లిపోతున్నాయి.
`ఆర్‌ఆర్‌ఆర్`పై తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ (Shankar) ప్రశంసలు కురిపించారు. ``ఆర్ఆర్ఆర్` సినిమా కన్నుల పండగలా ఉంది. చూపు తిప్పుకోనీయలేదు. శక్తివంతంగా ఉంది. చూస్తున్నప్పుడు అసాధారణ అనుభూతికి లోనయ్యాను. ఈ సినిమా చేసే విజయవంతమైన ధ్వని ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. `ఆర్ఆర్ఆర్` టీంకు ధన్యవాదాలు.. అద్భుతమైన నటన, స్క్రీన్ ప్రెజన్స్ తో చరణ్ మెప్పించగా, తారక్ మనసులను కదిలించేశారు.. తను స్క్రీన్ పై కనిపించినంత సేపు ఓ మెరుపులా అనిపించారు.. రాజమౌళి ఊహ శక్తికి తిరుగులేదు. మహారాజా మౌళికి హ్యాట్సప్` అని ట్వీట్ చేశారు శంకర్.
మరోవైపు ఈ సినిమాకి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. భాషలకు అతీతంగా మేకర్స్ `ఆర్‌ఆర్‌ఆర్`పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభని, ఎన్టీఆర్, చరణ్‌ల నట విశ్వరూపాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. చిరంజీవి, మహేష్, బన్నీ,సుకుమార్ ఇలా చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు సినిమాపై ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు రాజమౌళి. అందరికి ధన్యవాదాలు తెలిపారు. `ఉరుములతో కూడిన ప్రశంసలు కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రశంసల కారణంగా ఆనందంతో పొంగిపోతున్నా` అని ట్వీట్ చేశారు జక్కన్న.
ఇదిలా ఉంటే ఆయన వెకేషన్ ప్లాన్ చేస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` కోసం మూడేళ్లుగా నిరంతరం శ్రమించాడు రాజమౌళి. ఆయనతోపాటు ఆయన ఫ్యామిలీ కూడా సినిమాలో భాగమైంది. ఓ రకంగా ప్రాణం పెట్టింది. సినిమా విడుదలై సంచలనాల దిశగా రన్ అవుతున్న నేపథ్యంలో ఇక బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నారు రాజమౌళి. తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేశారు. మార్చి నెలాఖరు వరకు `ఆర్‌ఆర్‌ఆర్` ప్రమోషన్ కార్యక్రమాలు చూసుకుని, ఏప్రిల్ మొదటి వారంలో ఫ్యామిలీతో కలిసి యూరప్ ప్లాన్ చేశారట. ఓ పదిహేనురోజులపాటు వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.
ఈ వెకేషన్‌లో బిగ్ రిలీఫ్ పొందబోతున్నారు. ఆ వెకేషన్ పూర్తి చేసుకున్నాక మహేష్‌తో సినిమాపై దృష్టి పెట్టాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. మహేష్‌తో తన నెక్ట్స్ సినిమాని రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరా నుంచి ప్రారంభించాలనుకుంటున్నారట. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ చిత్రం సాగబోతుందని విజయేంద్రప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో మహేష్ ఓ సాహసికుడిగా కనిపించబోతున్నారని టాక్.