`గేమ్‌ ఛేంజర్‌`, `ఇండియన్‌ 2` సీక్వెల్స్ కి శంకర్ ప్లాన్‌.. క్లారిటి ఇదే!

Published : Oct 13, 2023, 04:54 PM IST
`గేమ్‌ ఛేంజర్‌`, `ఇండియన్‌ 2` సీక్వెల్స్  కి శంకర్ ప్లాన్‌.. క్లారిటి ఇదే!

సారాంశం

భారీ చిత్రాల దర్శకుడు ఇప్పుడు ఏక కాలంలో `గేమ్‌ ఛేంజర్`, `ఇండియన్‌ 2` చిత్రాలు రూపొందిస్తున్నారు. అయితే వీటికి సీక్వెల్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది.   

శంకర్‌ ప్రస్తుతం ఏక కాలంలో రెండు సినిమాలను రూపొందిస్తున్నారు. ఓ వైపు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న `ఇండియన్‌ 2`ని పూర్తి చేశాడు. లోక నాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది చిత్రీకరణ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ వర్క్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. కాజల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ వంటి వారు ఇందులో నటిస్తున్నారు. 

దీంతోపాటు శంకర్‌.. తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా `గేమ్‌ ఛేంజర్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కూడా చాలా డిలేతో చిత్రీకరణ జరుగుతుంది. షెడ్యూల్‌ షెడ్యూల్‌కి చాలా గ్యాప్‌ వస్తుంది. శంకర్‌ అటు `ఇండియన్‌ 2` షూటింగ్‌లో పాల్గొంటున్న నేపథ్యంలో `గేమ్‌ ఛేంజర్‌` కి బ్రేకులు పడుతున్నాయి. అయితే ఇప్పుడు కంటిన్యూగా ఈ చిత్రంపైనే ఫోకస్‌ పెట్టబోతున్నారు శంకర్‌. 

ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. `గేమ్‌ ఛేంజర్‌` రెండు భాగాలుగా, అలాగే `ఇండియన్‌ 2`కి మరో సీక్వెల్‌ ఉంటుందనే వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం క్లారిటీ వార్త వినిపిస్తుంది. అనుకున్నట్టుగా, ప్రచారం జరుగుతున్నట్టుగా `గేమ్‌ ఛేంజర్‌`కి రెండు భాగాలుగా రాబోతుందనే వార్తలో నిజం లేదని తెలుస్తుంది. అది పూర్తిగా రూమర్‌ మాత్రమే అని సమాచారం.   

అయితే `ఇండియన్‌ 2`కి మాత్రం సీక్వెల్‌ ఉంటుందట. సీక్వెల్‌కి లీడ్‌ వదిలేలా కథ ఎండ్‌ అవుతుందని, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, సమకాలీన అంశాల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. అయితే శంకర్‌ నెక్ట్స్ సినిమా `ఇండియన్‌ 3`నా లేక, కొంత గ్యాప్‌తో ఈ సీక్వెల్‌ని రూపొందిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక రామ్‌చరణ్‌ హీరోగా పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌`లో కీయారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. సీఎంగా, ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఆయన మెస్మరైజ్‌ చేయబోతున్నారట. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర