Shakuntalam Firstlook: మీరెప్పుడు చూడని సరికొత్త సమంత!

Published : Feb 21, 2022, 10:12 AM IST
Shakuntalam Firstlook: మీరెప్పుడు చూడని సరికొత్త సమంత!

సారాంశం

శాకుంతలం నుండి సమంత ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. సమంత శకుంతలగా పౌరాణిక అవతారంలో ఆకట్టుకుంది. శాకుంతలం ఫస్ట్ లుక్ పోస్టర్ క్షణాల్లో వైరల్ గా మారింది.   


దర్శకుడు గుణశేఖర్ బర్త్ డే నాడు శాకుంతలం మూవీ ఫస్ట్ లుక్ (Shakuntalam Firstlook)విడుదల అనౌన్స్మెంట్ చేశారు. చెప్పిన విధంగా నేడు ఉదయం శాకుంతలం నుండి సమంత లుక్ తో కూడిన పోస్టర్ విడుదల చేశారు. శకుంతలగా సమంత మెస్మరైజ్ చేశారు. తెల్లని దుస్తులు ధరించి ప్రకృతి వడిలో సేద తీరుతున్న సమంతకు అడవిలోని అందమైన ప్రాణులు కబుర్లు చెబుతున్నట్లు ఉంది. చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో ఈతరహా చిత్రం తెరకెక్కుతుంది. శాకుంతలం ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

ఇక శాకుంతలం (Shakuntalam)మూవీ షూటింగ్ కంప్లీటై చాలా రోజులవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి కనీస అప్డేట్స్ లేవు. సమంత నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. గుణశేఖర్ పౌరాణిక గాథగా శాకుంతలం తెరకెక్కిస్తున్నారు. పౌరాణిక చిత్రం నేపథ్యంలో షూటింగ్ మొత్తం సెట్స్ లోనే కంప్లీట్ చేశారు. చిత్రీకరణ త్వరగా ముగించిన మణిశర్మ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. 

 సీజీ పార్ట్ అధికంగా ఉన్న కారణంగా శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ సమంతకు జంటగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ మూవీతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తుండగా... గుణ టీం వర్క్స్ బ్యానర్ లో నీలిమ గుణ నిర్మిస్తున్నారు.
 
ఇక సమంత (Samantha)నటిస్తున్న మరొక చిత్రం యశోద. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. అలాగే నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటించిన కణ్మణి రాంబో ఖతీజా చిత్రం విడుదల కావాల్సి ఉంది. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. 
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్