లవ్ లెటర్ ఇచ్చా.. నిర్మాతపై షకీలా కామెంట్స్!

Published : Mar 04, 2019, 06:05 PM IST
లవ్ లెటర్ ఇచ్చా.. నిర్మాతపై షకీలా కామెంట్స్!

సారాంశం

ఒకప్పటి బి గ్రేడ్ సినిమాల సుందరి షకీలా బయోపిక్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఆమె జీవితానికి సంబందించిన అన్ని వివిధాలు అలాగే మోసపోయిన విధానం ఇతర సినీ నటుల రహస్యాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. 

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో షకీలా ఒక విషయాన్నీబయటపెట్టింది. షకీలా స్టార్ గా ఉన్న సమయంలో చాలా మందితో ఆమె ప్రేమను కొనసాగించారు. కానీ ఎవరు కూడా ఆమెకు జీవితాంతం తోడుగా ఉండటానికి రాలేదని లేటుగా అర్దమయ్యిందట. అయితే ఒక నిర్మాతను మాత్రం నేనే ఇష్టపడ్డాను అని వివరణ ఇచ్చింది. 

మలయాళంలో చోటా ముంబయ్ అనే సినిమా చేస్తోన్న సమయంలో తల్లి ఆరోగ్యానికి గురైందట. దీంతో శాస్త్ర చిక్కిత్స కోసం నిర్మాత రాజును కొంత డబ్బు అడిగింది. అయితే ఆ సమయంలో ఆయన రెమ్యునరేషన్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసి ఇచ్చారని అయితే అప్పుడే ఆయన్ను ఇష్టపడినట్లు చెప్పారు. అదే విధంగా లవ్ లెటర్ కూడా రాసినట్లు షకీలా వివరించారు. 

కానీ అతని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో విషయం అర్థమైందని ఆ తరువాత అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేసినట్లు చెప్పింది. అంతేకాకుండా ప్రేమ పేరుతో మోసం చేసేవారికన్నా అతనే బెటర్ అని.. నేను ప్రేమిస్తున్నా అని చెప్పినా కూడా ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోకుండా రాజు సైలెంట్ అయిపోయారని అతను మంచి వ్యక్తి అంటూ షకీలా వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: మీరు త్వరగా రావాలి, పవన్ సర్జరీపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్.. చిరు, బన్నీ, చరణ్ ఏమంటున్నారంటే
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య