కమల్ పార్టీ ప్రచారానికి వెళతా : షకీలా

Published : Mar 11, 2018, 09:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కమల్ పార్టీ ప్రచారానికి వెళతా : షకీలా

సారాంశం

మంచి చేయాలనే ఉద్దేశంతోనే కమల్ రాజకీయ పార్టీ   ప్రజలను విద్యావంతులను చేయడం ద్వారా సమాజంలో మార్పు తేవచ్చని కమల్ అంటుంటారు ఆ విషయాన్ని నేను సమర్థిస్తా : షకీలా

ప్రముఖ రాజకీయనేత, నటుడు కమలహాసన్ తన సొంత పార్టీ ప్రచారం నిమిత్తం రావాలని ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళతానని శృంగార తార షకీలా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రజలను  విద్యావంతులను, చైతన్య వంతులను చేయాలని కమల్ హాసన్ తరచుగా చెబుతుంటారని అన్నారు. ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిచండం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తేవచ్చనే కమల్ ఉద్దేశ్యాన్ని తాను సమర్థిస్తానని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కమల్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా, ఆయనపై విమర్శలు గుప్పించడం తగదని అన్నారు. కాగా, షకీలా నటించిన 250వ చిత్రం ‘శీలవతి’. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. కేరళలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. మేలో విడుదల కానున్న ఈ చిత్రానికి దర్శకుడు సాయిరామ్ దాసరి, నిర్మాత వీరు బాసింశెట్టి.

PREV
click me!

Recommended Stories

రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు
Balakrishna: నిజమే, పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య త్యాగం.. ఓజీ గెలిచింది ఇప్పుడు అఖండ 2 గెలవాలి