ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ మరింత ముందుకు.. ఒరిజినల్ స్కోర్ విభాగంలో షార్ట్ లిస్ట్ అయిన ‘నాటు నాటు’!

By team teluguFirst Published Dec 22, 2022, 7:14 AM IST
Highlights

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. రేసులో మరింత ముందుకు వెళ్తూ తాజాగా ఒరిజినల్ స్కోర్ విభాగంలో చోటుదక్కించుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్ విడుదల చేసిన జాబితాలో ‘నాటు నాటు’ సాంగ్ షార్ట్ లిస్టు అయ్యింది.    

ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్  క్రియేట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ రేసు లో మరింత ముందుకు వెళ్లొంది. ఈ ఏడాది ఇప్పటికే ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరూ భావించారు. అధికారికంగా ఎంట్రీ సాధించకపోవడంతో.. స్వయంగా సినిమానే ఆస్కార్ కు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒక విభాగంలో మాత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. తాాజాగా 95వ అకాడమీ అవార్డ్స్ విడుదల చేసిన షార్ట్ లిస్టులో ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’కు చోటు దక్కింది. సంచలనం సృష్టించిన ‘నాటు నాటు’ సాంగ్ షార్ట్ లిస్టు కావడం విశేషం. మరోవైపు ఉత్తమ నటులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నామినేషన్ దక్కించుకుంటాని అభిమానులు ఆశిస్తున్నారు. 

2023 అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ 95వ అవార్డుల కోసం పది కేటగిరీల్లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ను షార్ట్ లిస్టు చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాటకు ట్యూన్ కట్టారు. లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించిన విషయం తెలిసిందే. కాల బైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాటను అద్భుతంగా ఆలపించడంతో ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇతర భాషల్లోనూ సాంగ్ కు మంచి వ్యూస్ దక్కాయి. 

రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి హాలీవుడ్ క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే ఆయా కేటగిరిల్లో అవార్డ్స్ ను సొంతం హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి గుర్తింపు దక్కగా.. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌, హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ (HCA), లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్, అంటార్కిటిక్ ఫిల్మ్ కిట్రిక్స్ నుంచి వరుసగా అవార్డును దక్కించుకుంది. . 

బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’కు మరోవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డును క్రియేట్ చేసింది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గోవ ఇండియన్ ఫిల్మ్ గా నిలిచింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఉద్యమవీరులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా సరన్ లాంటి స్టార్ కాస్ట్ ప్రధాన పాత్రల్లో పోషించారు. నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు.

click me!