రాధే శ్యామ్ టైటిలే కరెక్ట్ కాదు.. ఈ కారణాల వలనే సినిమా దెబ్బైపోయింది... సీనియర్ రైటర్ పరుచూరి కామెంట్స్ 

Published : Apr 11, 2022, 03:08 PM IST
రాధే శ్యామ్ టైటిలే కరెక్ట్ కాదు.. ఈ కారణాల వలనే సినిమా దెబ్బైపోయింది... సీనియర్ రైటర్ పరుచూరి కామెంట్స్ 

సారాంశం

ప్రభాస్ కెరీర్ లో రాధే శ్యామ్ భారీ ఫ్లాప్ గా నిలిచిపోయింది. రికార్డు స్థాయి ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన రాధే శ్యామ్ కనీసం యాభై శాతం పెట్టుబడి కూడా రాబట్టలేకపోయింది. కాగా రాధే శ్యామ్ ఫెయిల్యూర్ వెనుక కారణాలేమిటో సీనియర్ రైటర్ పరుచూరి వివరించారు.

రచయిత పరుచూరి గోపాలకృష్ణ రాధే శ్యామ్ (Radhe Shyam)మూవీకి తనదైన విశ్లేషణ ఇచ్చారు. ఆ మూవీ పరాజయం వెనుక కారణాలు అన్వేషించారు. రాధే శ్యామ్ మూవీ లైన్ అద్భుతం అయితే కొన్ని లోపల వలన సినిమా ఆడలేదన్నారు. ముఖ్యంగా రాధే శ్యామ్ సాంగ్స్ చాలా మైనస్ అని పరుచూరి అభిప్రాయపడ్డారు. ప్రేమకథా చిత్రాలకు సాంగ్స్ చాలా అవసరం. కట్టిపడేసే సంగీతం ప్రేక్షకుడిని సినిమాతో పాటు ప్రయాణించేలా చేస్తాయి. రాధే శ్యామ్ మూవీలో ఒక్క పాట కూడా మరలా మరలా వినాలని అనిపించేలా ఉండదు. 

మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ ఎదురీత, ఆరాధన వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించి హిట్స్ కొట్టారు. ఆ చిత్ర విజయాల్లో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి.  బాహబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ మారిపోయింది. ఫ్యాన్స్ ఆయన నుండి ఆశించే అంశాలు రాధే శ్యామ్ మూవీలో లేవు. ఫైట్స్, మాస్ డైలాగ్స్ వంటి లేవు.  ప్రభాస్(Prabhas) కెరీర్ లో ప్రేమ కథలు అంటే వర్షం, మిర్చి లాంటి సినిమాలు గుర్తు వస్తాయి. ఆ సినిమాల్లో లవ్ స్టోరీతో పాటు కమర్షియల్ అంశాలున్నాయి. అసలు ప్రభాస్ ఇమేజ్ కి రాధే శ్యామ్ స్టోరీ సరిపోదు. ఇక మూవీ టైటిల్ కూడా ఒకింత నెగిటివ్ ఇంపాక్ట్ చూపింది. అలాగే బాహుబలి మూవీ ప్రభావం కూడా రాధే శ్యామ్ విఫలం కావడంలో ఒక కారణం అన్నారు. 

పరుచూరి పలుకులు పేరుతో గోపాల కృష్ణ మూవీ విశ్లేషణలు చేస్తున్నారు. తన లేటెస్ట్ యూట్యూబ్ వీడియోలో ఆయన రాధే శ్యామ్ మూవీ గురించి ఆసక్తికర వివరణ ఇచ్చారు. కాగా రాధే శ్యామ్ మూవీపై పరుచూరి అభిప్రాయాన్ని చాలా మంది నెటిజెన్స్ అంగీకరిస్తున్నారు. అయితే ప్రభాస్ లుక్ కూడా ఏమంత బాగోలేదనేది కొందరి భావన. బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ లో చాలా చేంజెస్ వచ్చాయి. సాహో చిత్రంలోనే ప్రభాస్ లుక్ డిఫరెంట్ గా కనిపించింది. రాధే శ్యామ్ లో ఆయన మరింత దారుణంగా కనిపించారు.  డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాల్లో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. వయసులో ప్రభాస్ కంటే పెద్ద హీరోలు మహేష్, పవన్ మంచి లుక్ మైంటైన్ చేస్తున్నారు. ప్రభాస్ మాత్రం 40 ఏళ్లకే చాలా పెద్దవాడిగా కనిపిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో