
ప్రముఖ కోలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ దిల్ ఖుష్ అవుతున్నారు. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. స్టార్ హీరోగా సూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికంటే ఎక్కువగా ఆనందం పొందుతున్నారు. దానికి కారణం తన తనయుడు వేదాంత్.
స్టార్ సీనియర్ హీరో మాధవన్ సంతోషంలో ఉబ్బి తబ్బుబ్బి అవుతున్నాడు. తన కుమారుడు వేదాంత్ సాధించిన రికార్డ్స్ తో మాధవన్ అవధుల్లేని సంతోషంలో విహరిస్తున్నాడు. మాధవన్ తనయుడు స్విమ్మింగ్ ఎన్నో రికార్డ్స్ సాధిస్తూ వచ్చాడు. ప్రతీ సారి ఏదో ఒకక్క కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంటూ.. తండ్రి పేరు నిలబెడుతున్నాడు. ఇక తాజాగా మరో రికార్డ్ బ్రేక్ చేశాడు స్టార్ కిడ్.
ఇక వేదాంత్ తాజాగా జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. అది కూడా 16 వయన్సులో వేదాంత్ జూనియర్ స్థాయిలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భువనేశ్వర్ లో జరుగుతున్న 48వ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో వేదాంత్ 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ లో విజేతగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు 16.06 నిమిషాలతో అద్వైత్ పగే పేరిట ఉండగా.. దానిని వేదాంత్ 16.01 నిమిషాలలో బ్రేక్ చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
ఇక తన కుమారుడు సాధించిన ఈ జాతీయ స్విమ్మింగ్ రికార్డ్ ను.. పోటీల్లో కొత్త రికార్డు నెలకొల్పిన విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. చేయలేనిదంటూ ఏదీ ఉండదు... 1500మీ ఫ్రీస్టయిల్ అంశంలో జాతీయ జూనియర్ రికార్డు బద్దలైంది అంటూ ట్వీట్ చేశారు.