సీనియర్ దర్శక, నిర్మాత తాతినేని ప్రకాశరావు, దర్శక, నిర్మాత టీఎల్‌వి ప్రసాదరావు తల్లి తాతినేని అన్నపూర్ణ(91) ఇకలేరు. ఇటీవల కరోనా సోకడంతో దానితో పోరాడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
సీనియర్ దర్శక, నిర్మాత తాతినేని ప్రకాశరావు, దర్శక, నిర్మాత టీఎల్‌వి ప్రసాదరావు తల్లి తాతినేని అన్నపూర్ణ(91) ఇకలేరు. ఇటీవల కరోనా సోకడంతో దానితో పోరాడుతూ ఆదివారం ఆమె(1930- 2021) తుదిశ్వాస విడిచారు. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజ నటులతోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎందరో నటీ నటుల చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన దర్శకుడు తాతినేని ప్రకాశరావు. వీరి కుమారుడు ప్రముఖ చలన చిత్ర దర్శకుడు TLV ప్రసాద్ కాగా, కుమార్తె లీల అమెరికాలో స్థిరపడ్డారు.
నాని నటించిన `భీమిలీ కబడ్డీ జట్టు` సినిమాతో దర్శకుడిగా పరిచయమై `SMS`, `శంకర`, `వీడెవడు` లాంటి హిట్స్ అందించిన నేటి తరం దర్శకుడు తాతినేని సత్య అన్నపూర్ణ గారి మనవడు కావడం విశేషం. తన ఇంటినుండే మూడు తరాల చలన చిత్ర దర్శకులను అందించిన అన్నపూర్ణ గారి పరమపదం బాధాకరం. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.