విషాదంః కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ కన్నుమూత

By Aithagoni RajuFirst Published May 10, 2021, 10:20 AM IST
Highlights

కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం కోమాలోకి వెళ్లారు.

కరోనా విలయ తాండవం చేస్తోంది. అనేక మంది ప్రముఖులను, సాధారణ ప్రజలను పొట్టన పెట్టుకుంటుంది. ఇప్పటికే అనేక మంది జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. తాజాగా కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేదు. చివరికి ఆయన సోమవారం ఉదయం కాచిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో జర్నలిస్ట్ లోకం, సినీ పరిశ్రమ షాక్‌కి గురయ్యింది. 

ప్రాంక్లీ విత్ టి యన్ ఆర్ షో తో పాపులరయ్యారు జర్నలిస్ట్ టిఎన్నార్. ఆయన ఇటీవల కరోనా బారిన పడి కాచిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. `ఆరోగ్య పరిస్దితి క్రిటికల్ గా మారి, పల్స్ రేటు బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ కోమా పరిస్దితులో ఉన్నార`ని ఆదివారం ఆయన స్నేహితుడు మరో జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పెట్టారు. క్రితం నెలలో టీఎన్నార్ సోదరికి కరోనా పాజిటివ్ వచ్చి వెంటిలేటర్ మీద పెట్టారు. అయితే ఆమె మెల్లిగా కోలుకుని బయిటపడ్డారు. ఆ తర్వాత టీఎన్నార్ కరోనా బారిన పడటం, అదీ సీరియస్ అవటం, చివరికి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. 

గత కొంతకాలంగా టీఎన్నార్ కి సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. నటుడుగా ఆయనకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఏప్రియల్ 24 కూడా తను ఓ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఉన్నానని ఓ స్టిల్ షేర్ ఫేస్ బుక్ లో చేసారు. ఇంతలోనే ఆయనకు కరోనా ఎటాక్ అయ్యింది. ఇక టీఎన్‌ఆర్‌ మృతి పట్ల జర్నలిస్టులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

click me!