పరిశ్రమలో తీవ్ర విషాదం... సీనియర్ దర్శకుడు కన్నుమూత!

Published : Dec 25, 2020, 04:16 PM ISTUpdated : Dec 25, 2020, 04:46 PM IST
పరిశ్రమలో తీవ్ర విషాదం... సీనియర్ దర్శకుడు కన్నుమూత!

సారాంశం

సీనియర్ దర్శకుడు, నటుడు  ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.   

చిత్ర పరిశ్రమలో విషాదాల పరంపర కొనసాగుతుంది. టాలీవుడ్ కి చెందిన మరో దర్శకుడు కన్నుమూశాడు. 2020లో అనేక మంది నటులు, చిత్ర ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా సీనియర్ దర్శకుడు, నటుడు  ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 

ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. నాటకరంగం నుంచి సినీరంగానికి వచ్చిన ఆయన దర్శకత్వ శాఖలో కృష్ణ, విజయనిర్మల, వి.రామచంద్రరావు, కె.హేమాంబదరరావు, కె.ఎస్,ఆర్.దాస్ తదితరుల దగ్గర పలు చిత్రాలకు పనిచేశారు. అనంతరం ``కన్నెవయసు'' , ``లవ్ ఇన్ సింగపూర్'' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ``లవ్ ఇన్ సింగపూర్'' చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే. 

ఇక  పలువురు ప్రముఖ హీరోల చిత్రాలలో కూడా నటుడిగా కనిపించి తన అభిరుచిని చాటుకున్నారు. దాదాపు 70కి పైగా చిత్రాలలో ఆయన నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు