వెండితెరపైకి జమున బయోపిక్‌.. విలక్షణ నటిగా తమన్నా.. ?

Published : Mar 12, 2021, 07:37 PM IST
వెండితెరపైకి జమున బయోపిక్‌.. విలక్షణ నటిగా తమన్నా.. ?

సారాంశం

తాజాగా మరో అలనాటి నటి జమున బయోపిక్‌ని రూపొందించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. `దేవినేని` చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శివనాగు ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. 

అలనాటి తారల బయోపిక్‌లు నేటితరానికి ఆసక్తికరంగా ఉంటాయి. మహానటి సావిత్రి బయోపిక్‌ `మహానటి`గా రూపొంది సంచలన విజయం సాధించింది. `ఎన్టీఆర్‌` బయోపిక్‌, సిల్క్ స్మిత బయోపిక్‌ `డర్టీ పిక్చర్స్`, సంజయ్‌దత్‌ బయోపిక్‌ `సంజు` చిత్రాలు అలరించాయి. తాజాగా మరో అలనాటి నటి జమున బయోపిక్‌ని రూపొందించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. `దేవినేని` చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శివనాగు ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. 

ప్రస్తుతం కథ వర్క్ జరుగుతుందని, దర్శకుడు తమన్నాని జమున పాత్ర కోసం తీసుకునే ఆలోచనలో ఉన్నారని, దీనిపై తమన్నాతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయట. దీనిపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని, కథ ఇంకా ఫైనల్‌ కావాల్సి ఉందని, అనంతరం దీనిపై క్లారిటీ వస్తుందని ఫిల్మ్ నగర్ టాక్‌. అయితే జమున నుంచి మాత్రం ఈ బయోపిక్‌కి సంబంధించి అనుమతి తీసుకున్నట్టు తెలుస్తుంది.  

జమున పాత్రలో నటించాలంటే అద్భుతమైన నటన, డాన్సులు, హవాభావాలు పలికించే పరిణతి ఉండాలని, అందుకు సీనియర్‌ నటి అయితే సూట్‌ అవుతుందని భావిస్తున్నారట. మరి ఇది ఎంత వరకు పట్టాలెక్కుతుందనేది చూడాలి. తమన్నా ప్రస్తుతం `సీటీమార్‌`, `గుర్తుందాశీతాకాలం`, `అంధాధున్‌` రీమేక్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?