పవన్ కళ్యాణ్ ఓటమిపై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Published : May 30, 2019, 10:04 AM IST
పవన్ కళ్యాణ్ ఓటమిపై నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సారాంశం

ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. 

ఏపీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. జనసేనకి సీట్లు రానప్పటికీ ఏడు శాతానికి పైగా ఓట్లను దక్కించుకుంది. ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టకుండా.. నూతన రాజకీయాలకు పవన్ శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా 'మా' ప్రెసిడెంట్ నరేష్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలకు సంబంధం లేదని, కానీ పవన్ ను అభిమానిస్తానని చెప్పారు.

డబ్బులకు అతీతంగా రాజకీయాలు చేసే రోజు వచ్చినప్పుడు  దేశం బాగుపడుతుందన్న ఆయన.. రాజకీయాల్లో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వారు అంతకు నాలుగైదు రెట్లు రాబడతారని.. ఈలోగా జైలు వెళ్లడానికి సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ డబ్బు పంచకుండా పోటీ చేస్తానని అన్నాడు.. చేసి చూపించాడు. గెలిచాడా..? లేదా..? అనే విషయం పక్కన పెడితే మార్పుకి నాంది పలికాడు.

అందుకే పవన్ కళ్యాణ్ ని నేను అంతగా ఇష్టపడతాను. త్వరలోనే వెళ్లి ఆయన్ను కలుస్తానని చెప్పారు. డబ్బుతో కూడిన రాజకీయాలను కట్టడి చేయడానికి లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ లాంటి శక్తులు కలిసి రావాలని నరేష్ అన్నారు.  

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..