నా బయోపిక్ తీస్తే బాగుండదు.. అలనాటి స్టార్ హీరోయిన్ కామెంట్!

Published : May 30, 2019, 09:10 AM ISTUpdated : May 30, 2019, 09:13 AM IST
నా బయోపిక్ తీస్తే బాగుండదు.. అలనాటి స్టార్ హీరోయిన్ కామెంట్!

సారాంశం

బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గ వెలుగొందిన మాధురి దీక్షిత్ బయోపిక్ కి సన్నాహకాలు జరుగుతున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్స్ అని అంతా అనుకునే లోపే ప్రయత్నాలు అయితే జరిగినట్లు రుజువయ్యింది. కానీ మాధురి జీవితం తెరకెక్కడం కష్టమే.. 

ఎందుకంటే తన జీవితాన్ని తెరపై చూసుకోవడం తనకు ఇష్టం లేదని ఇంకా సాధించాల్సింది చాలా ఉందని మాధురి దీక్షిత్ మేకర్స్ కి సమాధానం ఇచ్చారట. ఇటీవల కొంతమంది నిర్మాతలు ఆమెను కలువగా తన బయోపిక్ తీస్తే బావుండదని మొహం మీదే చెప్పేశారట. మాధురి దీక్షిత్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 

అయితే బయోపిక్ అంటే తెరపై మంచి విషయాలతో పాటు చెడు విషయాలను - చేదు అనుభవాలను కూడా చూపించాల్సి ఉంటుంది. ఎఫైర్స్ లాంటి విషయాలు కూడా ఉంటాయి. అయితే మాధురి తన కెరీర్ లో అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని అప్పట్లో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఏది ఏమైనా మాధురి మాత్రం తన కథను తెరపై చుపించాడనికి ఒప్పుకోవడం లేదు. 

PREV
click me!

Recommended Stories

వాలెంటైన్స్ డే స్పెషల్ .. ఫిబ్రవరి 13న రిలీజ్ అవ్వబోతున్న నిలవే సినిమా
Renu Desai : నాకంటూ ఎవరు లేరు, ఎవరికి చెప్పుకోలేను, పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్