
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవరి(Mithun Chakraborty) ఆసుపత్రి పాలయ్యారు. ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరినట్టు బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా తెలిపారు. ఆయన ట్విట్టర్ ద్వారా ఆసుపత్రిలో బెడ్‌పై ఉన్న మిథన్ చక్రవర్తి ఫోటోని పంచుకున్నారు. త్వరగా కోలుకోవాలని తెలిపారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తన అభిమాన నటుడు సడెన్‌గా ఆసుపత్రిలో చేరడంతో టెన్షన్‌కి గురవుతున్నారు.
దీనిపై మిథున్ చక్రవర్తి స్పందించారు. హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. సీరియస్ ఏం లేదని తెలిపారు. మిథున్ కిడ్నీలో స్టోన్స్ పెయిన్‌తో బాధపడుతున్నారట. దానికి సంబంధించి ఆసుపత్రిలో చేరారట. ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు పూర్తి క్షేమంగా ఉన్నట్టు చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏప్రిల్ 30నే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. ఇటీవల నటుడు ధర్మేంద్ర కూడా ఆసుపత్రిలో చేరిన విసయం తెలిసిందే. తన రెగ్యూలర్ చెకప్ కోసం చేరినట్టు వార్తలొచ్చాయి. ఆతర్వాత ఆయన డిశ్చార్జ్ ఆయ్యారట. ఇప్పుడు మిథున్ చక్రవర్తి ఆసుపత్రి పాలయ్యారనే వార్త వైరల్‌గా మారింది.
ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలను ఓ ఊపుఊపేశారు మిథున్ చక్రవర్తి. శ్రీదేవితోనూ అనేక చిత్రాల్లో నటించారు. వీరిద్దరు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మూడేళ్ల తర్వాత విడిపోయారు. ఇక చివరగా మిథున్ `ది కాశ్మీర్ ఫైల్స్` చిత్రంలో నటించి మెప్పించారు. దీంతోపాటు `హునార్‌బాజ్` షోకి జడ్జ్ గానూ వ్యవహరించారు.