
సెల్ఫీ పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.. వరంగల్ రైల్వేగేట్ దగ్గరలోని శాంతినగర్‌కు చెందిన తౌటం శివ అనే యువకుడి సెల్ఫీ వీడియో తీసుకుంటూ రైలు గుద్దేయడంతో చనిపోయాడు.. హైదరాబాద్‌లోని ఓ జిమ్ సెంటర్‌లో కోచ్‌గా పనిచేస్తున్న శివ.. రైల్వే ట్రాక్ పక్కన నిలబడి, ఎంఎంటీఎస్ రైలు వస్తుండగా సెల్ఫీ వీడియో తీసుకునే ప్రయత్నం చేశాడు.. ఎంఎంటీఎస్ రైలు వస్తుండగా శివ సెల్ఫీ తీసుకున్నాడు.. అయితే వెనుక నుంచి రైలు ఒక్కసారిగా వచ్చి శివాని ఢీకొట్టడంతో అందరూ అతను తిడుతూ పిచ్చి పని చేశాడంటూ పోస్ట్ లు షేర్ చేశారు..
దీంతో అతను చనిపోయారని వార్తల్లో వేశారు.. కానీ ఈ సెల్ఫీ వీడియో వెనుక ఓ పెద్ద ట్విస్ట్ ఉంది.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న శివ సెల్ఫీ వీడియో 8 నెలల కిందటిదని తెలిసింది. ఈ విషయాన్ని శివ తన మిత్రుడికి స్వయంగా చెప్పినట్టు తెలిసింది.‘సంఘటన జరిగినప్పుడే నాకు రైల్వే కోర్టులో జరిమానా విధించారు. ఇపుడు వీడియో తాజా వైరల్‌తో సరికొత్త సమస్య అయ్యేట్టు వుంది.’ అని వాపోయినట్టు చెబుతున్నారు. ఆ రోజు తన చేయికి గాయం మాత్రమే అయిందని, వీడియోను ఎవరు షేర్ చేశారో తెలియదని చెప్పినట్టు తెలిసింది. కాగా, శివ సెల్ఫీ పిచ్చిని చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.. ఈ క్రింద విడియోలో వైరల్ విడియో దాని కౌంటర్ విడియో చూడండి. స్టన్ అవుతారు.