శేఖర్ కమ్ములతో చైతు.. హీరోయిన్ ఎవరంటే..?

By AN TeluguFirst Published 17, Jun 2019, 1:56 PM IST
Highlights

అక్కినేని నాగచైతన్య ఇటీవల 'మజిలీ' చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం 'వెంకీ మామ' చిత్రంలో నటిస్తున్నారు. 

అక్కినేని నాగచైతన్య ఇటీవల 'మజిలీ' చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం 'వెంకీ మామ' చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ, చైతు కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

ఈ ప్రాజెక్ట్ తరువాత చైతు తన తండ్రి నాగార్జునతో కలిసి 'బంగార్రాజు' సినిమాలో నటించనున్నాడు. జూలై నెలాఖరున ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అలానే యువి బ్యానర్ లో ఓ సినిమా, దిల్ రాజుతో మరో సినిమా కమిట్ అయి టాలీవుడ్ లో బిజీ హీరోగా మారిపోయాడు.

ఇప్పుడు చైతుకి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల.. చైతుతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని భావిస్తున్నాడు. 

శేఖర్ కమ్ముల 'ఫిదా' చిత్రంతోనే సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు మరోసారి ఆయన సినిమాలో కనిపించడానికి రెడీ అవుతోంది. శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ అంటే అంచనాలు పెరగడం ఖాయం. మరి శేఖర్ కమ్ముల ఈసారి ఎలాంటి కథను ఎన్నుకుంటారో చూడాలి!
 

Last Updated 17, Jun 2019, 1:56 PM IST