
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాళ్ళపల్లి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాళ్ళపల్లి ఆసుపత్రిలో చిక్కిత్సపొందుతు తుది శ్వాసను విడిచారు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఈ సీనియర్ నటుడు గత ఏడాది వరకు పలు సీరియల్స్ అలాగే టీవీ షోల్లో నటించారు.
కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 850కు పైగా చిత్రాల్లో నటించిన రాళ్ళపల్లి పలు అవార్డులను కూడా అందుకున్నారు. ఆయన పూర్తీ పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహారావు. 1945లో ఆంధ్రప్రదేశ్ కంబదూర్ లో జన్మించిన ఆయన చిన్న వయసులోనే నాటకాల పట్ల ఆసక్తి చూపించారు. ఏనిమిది వేలకు పైగా నాటకాల్లో నటించారు. అందులో ఎక్కువగా ఆయనే స్వయంగా రాసి డైరెక్ట్ చేసినవే.
తనికెళ్ల భరణి లాంటి రచయితలకు మార్గదర్శి కూడా రాళ్లపల్లే. జ్యోతిష్కుడు, హిజ్రా, యానాది, పోలీస్, నావికుడు, ఇంట్లో పనివాడిగా తోట మాలిగా.. ఇలా ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. 1979లో చిరంజీవి నటించిన కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఆ తరువాత టాలీవుడ్ సీనియర్ నటులందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న రాళ్ళపల్లి 2009 వరకు బిజీ యాక్టర్ గానే కొనసాగారు. దర్శకులు జంధ్యాల, వంశీల పరిచయం రాళ్లపల్లిలోని హాస్య నటుడిని చూపించాయి.
ఖైదీ - అభిలాషా -అన్వేషణ - అహనా పెళ్ళంట - అగ్ని పుత్రుడు - కూలీ నెంబర్ వన్ - బొంబాయి - ఘటోత్కచూడు- కలిసుందాం రా - నువ్వు నేను - అవునన్నా కాదన్న - వంటి ఎన్నో సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
ఆ తరువాత ఆరోగ్య కారణాల వల్ల సినిమాలు తగ్గించారు. ఆయన చివరగా నాని భలే భలే మగాడివోయ్ సినిమాలో కనిపించరు. ఆ తరువాత టీవీల్లో వచ్చే వంట ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా రాళ్ళపల్లి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాళ్ళపల్లి మృతిపట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు రాజయాకియ నాయకులూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(200కోట్ల నుంచి 600కోట్ల) భారీ బడ్జెట్ చిత్రాలతో రెడీ అవుతున్న మన స్టార్స్