'పరాన్నజీవి' టీజర్... రాడ్ దింపారంటూ కామెంట్స్!

By Surya PrakashFirst Published Jul 24, 2020, 8:52 AM IST
Highlights

వ‌ర్మ పవర్ స్టార్‌  కి పోటీగా ఆయ‌న‌పై సెటైరిక‌ల్‌గా ప‌వ‌న్ క‌ళ్యాన్ అభిమానులు 'పరాన్నజీవి' అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  'బిగ్ బాస్' కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ విడుద‌ల చేశారు.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పరాన్న జీవి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘రెక్‌లెస్‌ జెనెటిక్‌ వైరస్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-2 కంటెస్టెంట్‌ నూతన్‌ నాయుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 99 థియేటర్‌ బ్యానర్‌పై సీఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ టీజర్ కు పవన్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. వోడ్కా నా పెగ్ లోకి రావాలి...ఫిగురు నా పక్కలోకి రావాలి వంటి డైలాగులతో షకలక శంకర్ ఇరగదీసాడని, రాడ్ దింపాడని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.  ఈ ట్రైలర్ మీరూ చూడండి. 
 

ఇక తన సినిమా పవన్‌ అభిమానులను ఆనంద డోలికల్లో ఊగిస్తుందని పరాన్న జీవి సినిమా రూపకర్త నూతన్‌ నాయుడు అంటున్నారు. పవర్‌స్టార్‌ సినిమాకి తన సినిమా పోటీ కాదని, జులై 25 వ తేదీకి ఓ ప్రాధాన్యత ఉంది కాబట్టే ఆ రోజు తన సినిమా విడుదల చేస్తున్నానన్నారు. తన సినిమాని మూణ్నాలుగు రోజుల్లో ఏదో అలా చుట్టి పారేయలేదని చాలా జాగ్రత్తగా కష్టపడి తీశాననన్నారు. ఇది వర్మ సినిమా కాదని, రాధా గోపాల్‌ వర్మ అనే వ్యక్తి సంబంధించిన సినిమా అని చెప్పుకున్నారు. తన సినిమాలో రాధా గోపాల్‌ వర్మ జీవితంలో చేసిన పనులు ఆయన స్వభావంలోని పార్శ్వాలు అన్ని ఉంటాయన్నారు.

నేర్చుకోవడానికి మారడానికి అవకాశం ఉన్న విషయాలు తమ సినిమాలో చూపిస్తున్నామని సమాజానికి ఎవరైనా చెడు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్తున్నామన్నారు. అలాగే తన సినిమాలో పాటలు, డ్యాన్సులు, జోకులు, పంచ్‌ డైలాగులు కూడా ఉంటాయన్నారు. ఈ సినిమాని ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నానని, అయితే పవన్‌ని ఇంప్రెస్‌ చేయడానికి సినిమా తీయాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఎవరి ప్రోత్సాహం లేదు. వెనుక ఎవరో ఉన్నారు, తోస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు అనుకోనవసరం లేదన్నారు. .

తన బలం, బలగం అంతా పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ అన్నారు. ఆయన అభిమానుల్ని తృప్తి పరచడానికే వాళ్ల కళ్లలో తృప్తి, సంతృప్తి చూడడానికే పరాన్న జీవి తీస్తున్నానన్నారు. సినిమా చూశాక వారి కళ్లలో బ్రహ్మానందం కనపడుతుందని స్పష్టం చేశారు. వర్మ మీద దాడి గురించి మాట్లాడుతూ ఎవరు ఎవరి మీద దాడి చేసినా అది హర్షణీయం కాదు, ఆమోద యోగ్యం కాదన్నారు. అయితే ఎంత మంది మీద ఆయన సినిమాలు తీస్తున్నారు? ఎందుకు దీన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన సినిమా వల్ల వర్మ తన మాటలు మార్చుకున్నాడని తాను పవన్‌ అభిమానిని అంటున్నాడని పవన్‌ హగ్‌ కావాలంటున్నాడని ఇది మార్పు కాదా అని నూతన్‌ నాయుడు అంటున్నారు.

click me!