ఆఫీసుపై జన సైనికుల దాడి: వాళ్లని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోందంటూ వర్మ ట్వీట్

Siva Kodati |  
Published : Jul 23, 2020, 07:35 PM IST
ఆఫీసుపై జన సైనికుల దాడి: వాళ్లని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోందంటూ వర్మ ట్వీట్

సారాంశం

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెరదీశారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘‘ పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’’ సినిమాపై వివాదం నెలకొంది

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెరదీశారు. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘‘ పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’’ సినిమాపై వివాదం నెలకొంది.

ఈ సినిమాపై పవన్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్మపై యుద్ధం ప్రకటించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో రామూను ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ తాజాగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని వర్మ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. జనసేన కార్యకర్తలు ఈ దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ‘‘ జనసేన కార్యకర్తలుగా చెప్పుకునే పీకే అభిమానులు నా కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని సెక్యూరిటీ గార్డులు, పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ‘‘ పవర్‌స్టార్’’కు ఇంకా ఎక్కువ పబ్లిసిటీ కల్పించినందుకు పవన్ ఫ్యాన్స్‌ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తోందని రామూ ట్వీట్ చేశారు.


 

 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?