బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

Published : Jul 03, 2020, 07:28 AM ISTUpdated : Jul 03, 2020, 07:33 AM IST
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

సారాంశం

సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ  అవార్డులు లభించాయి. 

బాలీవుడ్ ప్రముఖఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారు జామున ఆమె మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె కూతురు ధ్రువీకరించారు. 71 ఏళ్ల సరోజ్‌ఖాన్ శ్వాస కోస సమస్యలతో జూన్ 20వతేదీన బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. 

సరోజ్ ఖాన్ శ్వాసకోస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ  అవార్డులు లభించాయి. 

సరోజ్ ఖాన్ చివరి సారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన కళంక్ చిత్రంలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు సినీనటీనటులు తమ సంతాపం తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్
NTR: షారూఖ్‌ ఖాన్‌తో ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌.. `వార్‌ 2`తో దెబ్బ పడ్డా తగ్గని యంగ్‌ టైగర్‌