# Nani ‘సరిపోదా శనివారం’హిందీ డబ్బింగ్ రైట్స్ అంతా? షాక్ లో ట్రేడ్

By Surya PrakashFirst Published Mar 24, 2024, 4:17 PM IST
Highlights

 ఈ సినిమాకు బడ్జెట్ 90 కోట్లు దాకా పెడుతున్నారట.  ఇప్పటికే ఈ సినిమా నిర్మాత భారీగా థియేట్రికల్ బిజినెస్ ... , నాన్ థియేట్రికల్ బిజినెస్ ...జరిగింది. ఈ


  దర్శకుడు వివేక్ ఆత్రేయ తో నాని 31వ సినిమా  ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం దాదాపు పూర్తైందని సమాచారం. నిర్మాత మంచి లాభాల్లో ఉన్నారని, సేఫ్ జోన్ లోకి వచ్చేసారని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంత అడుగుతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) రైట్స్ నిమిత్తం 25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డీల్ ఇంకా పూర్తి కాలేదట. నాని గత చిత్రం దసరా ...9 కోట్లు వరకూ పలికిందిట. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు రికవరీ అయ్యిందిట. అంటే 27 కోట్లు దాకా హిందీలో వచ్చిందిట. దాంతో ఇప్పుడు ఈ సినిమాకు 25 కోట్లు దాకా అడుగుతున్నారని తెలుస్తోంది. నిర్మాత దానయ్య గతంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రొడ్యూస్ చేసి ఉండటంతో హిందీలో ఆయన సినిమాలకు మార్కెట్ ఉంది. అది కూడా ఇక్కడ ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే బిజినెస్ రీత్యా లెక్కలు వేరు. ప్రతీ సినిమా అలా 27 కోట్లు వసూలు చేస్తుందని నమ్మకం ఏముందని అంటున్నారు. అది ఖచ్చితంగా రిస్కే అవుతుందని చెప్తున్నారు. 

ఇక ఈ సినిమాకు బడ్జెట్ 90 కోట్లు దాకా పెడుతున్నారట.  ఇప్పటికే ఈ సినిమా నిర్మాత భారీగా థియేట్రికల్ బిజినెస్ ... , నాన్ థియేట్రికల్ బిజినెస్ ...జరిగింది. ఈ చిత్రం ఓటిటి రైట్స్ ని అదిరిపోయే రేటుకు నెట్ ప్లిక్స్ వారు తీసుకున్నారు. అలాగే థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు భారీ మొత్తానికే తీసుకున్నారు. శాటిలైట్ మిగతా రైట్స్ బిజినెస్ ఫైనల్ స్టేజిలో డిస్కషన్స్ లో ఉంది.  

ఓవరాల్ గా ఈ చిత్రం బిజినెస్ 100 కోట్లు ఎక్సపెక్ట్ చేస్తున్నారు. దాంతో  నిర్మాత సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్లే. ఇరవై కోట్లు మినిమం ప్రాఫెట్ ఉంటుందని చెప్తున్నారు. దసరా సూపర్ హిట్ అవటం, హాయ్ నాన్న చిత్రం యావరేజ్ అనిపించుకున్నా కలెక్షన్స్ బాగుండటం,ఓటిటిలో బాగా వెళ్లటంతో ఈ రేట్లు పలికినట్లు సమాచారం. 
  
ఇక  ఈ సారి అంటే సుందరానికి లాంటి సాఫ్ట్ సినిమా కాకుండా దసరా లాంటి యాక్షన్ ఎలిమెంట్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ యాక్షన్ ఇమేజ్ ని మించి నాని తో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు వివేక్ ఆత్రేయ.   'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి'... ఇప్పటి వరకు వివేక్ ఆత్రేయ తీసిన ప్రతి సినిమాకు వెరైటీ కాన్సెప్టు ని ఎంచుకుంటున్నారు. 

'సరిపోదా శనివారం' సినిమాను శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి కూడా ఆయనే నిర్మాత. ఇక, 'సరిపోదా శనివారం' విషయానికి వస్తే... ఈ సినిమాలో  హీరోయిన్ గా ప్రియాంకా అరుల్ మోహన్ ఎంపిక అయ్యారు. దానయ్య నిర్మిస్తున్న 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఓ నిర్మాణ సంస్థలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తోంది. 
 
ఇక ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతోందనేది నాని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం.  ఈ విషయమై నాని క్లారిటీ ఇచ్చారు. తన తాజా చిత్రం హాయ్ నాన్న ప్రమోషన్ లో భాగంగా అమెరికా వెళ్లిన ఆయన అక్కడ వారితో మాట్లాడుతూ... ఆగస్ట్ 2024కు ఈ చిత్రం రిలీజ్ కు రెడీ చేస్తామని  చెప్పుకొచ్చారు. కథ, పాత్ర డిమాండ్ మేరకు మేకోవర్ కూడా అవుతున్నారు. ‘సరిపోదా శనివారం’లో రగ్డ్ లుక్‌లో నాని కనిపించనున్నారు. 

‘సరిపోదా శనివారం’సినిమాలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘దసరా’ లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న మాస్, రగ్డ్ మూవీ తర్వాత.. ‘హాయ్ నాన్న’ అనే క్లాస్, ఫీల్ గుడ్ స్టోరీని నాని ఎంచుకున్నారు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ లాంటి డిఫరెంట్ యాక్షన్ జోనర్ కథను ఎంపిక చేసుకున్నారు.
 

click me!