బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా ‘లియో’ టీమ్ నుంచి స్పెషల్ మీడియో విడుదలైంది. ఆయనకు విషెస్ తెలుపుతూ ఆయన లుక్, పాత్ర పేరును పరిచయం చేశారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ (Sunjay Datt) ‘కేజీఎఫ్’ తర్వాత దక్షిణాది ప్రేక్షకులను విలన్ గా అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ లోని క్రేజీ ప్రాజెక్ట్ లో నెగెటివ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈరోజు సంజూ బాయ్ పుట్టిన రోజు కావడం విశేషం. నేటితో బాలీవుడ్ స్టార్ 64వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ బర్త్ డే విషెస్ తెలియజేశారు.
ఇప్పటికే పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పేరు బిగ్ బుల్ అనే క్యారెక్టర్ లో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. ఇక కొద్దిసేపటి కింద ‘లియో’ నుంచి కూడా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. సంజయ్ దత్ కు పుట్టినరోజు గిఫ్ట్ గా ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేశారు.
తమిళ స్టార్ విజయ్ దళపతి - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో Leo చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న వీడియోలో సంజయ్ క్యారెక్టర్ పేరు, ఫస్ట్ లుక్ ను చూపించారు. ‘ఆంటోనీ దాస్’ పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మాస్ టచ్ తోనూ అదరగొట్టారు. సిగరెట్ కాల్చుతూ, కారు నుంచి దిగుతూ నమస్తే చెప్పే తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక ‘లియో’లో విజయ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. చాక్లెట్ తయారు చేసే వ్యక్తిగా, మాఫియా డాన్ గా అలరించబోతున్నారంట. త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ లో రూపుదిద్దుకుంటోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది.
Meet 🔥🔥
A small gift from all of us to you sir! It was indeed a pleasure to work with you!🤜🤛 ❤️ 🔥🧊 pic.twitter.com/UuonlCF3Qa