
ఇది డిజిటల్ యుగం. సినిమా పోస్టర్ రిలీజైతే ఇది ఫలానా అంటూ మూలాలు తవ్వి పోసేస్తున్నారు సోషల్ మీడియా జనం. దాంతో దర్శక,నిర్మాతలు ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. నెటిజెన్స్ ఫలానా సినిమా కాపీ అని విమర్శలు చేయక మునుపే...మేమే ప్రేరణ పొందాం అని చెప్తే ఓ లెక్కగా పడుంటుంది. ఇది కెజిఎఫ్ 2 మేకర్స్ గ్రహించారు. దీనితో తాజాగా తాము విడుదల చేసిన అధీరా లుక్ ఫలానా లుక్ కు ప్రేరణ అని ప్రకటంచేసారు. దాంతో కాపీ రాగం తీయటానికి అవకాశం ఎవరికీ లేకుండా పోయింది.
వివరాల్లోకి వెళితే..ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ కు సీక్వెల్ గా వస్తోన్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్-2. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ సినీ అభిమానుల్లో భారీ అంచనానే ఉన్నాయి. కన్నడ నటుడు యశ్ మరోసారి ఈ చిత్రంతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అవుతానడని లెక్కలు వేస్తున్నారు. దాంతో ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో దింపారు.
సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. అధీరా పాత్రలో సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ స్టిల్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ను పెంచేస్తుంది. అయితే అధీర లుక్ న వైకింగ్స్ ని పోలినట్లు ఉందని, కాపీ అంటూ సోషల్ మీడియా గుప్పు మంది. దాంతో టీమ్ ...వెంటనే రంగంలోకి దిగి తాము వైకింగ్స్ స్పూర్తితో సంజయ్ దత్ క్యారక్టర్ రూపిందించినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. ఇలా దర్శక నిర్మాతలు అధీర లుక్ కి వైకింగ్స్ స్ఫూర్తి అని వెంటనే ప్రకటించటం వెనక కాపీ ఆరోపణలకు భయపడటమే అంటున్నారు.