#RC16 రామ్ చరణ్ కి ప్యాన్ ఇండియా విలన్ .... పెద్ద స్కెచ్చే వేసారే

By Surya PrakashFirst Published Mar 21, 2024, 5:10 PM IST
Highlights

స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. 


  రామ్ చరణ్ ,బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం ఎనౌన్సమెంట్ రావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపై పడింది.   ఆర్‌సీ16 వర్కింగ్ టైటిల్ తో చేస్తున్న  ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ఇప్పుడు ఆర్టిస్ట్ ల ఎంపిక జరుగుతోంది. అందులో భాగంగా ఈ చిత్రం విలన్ ని సెట్ చేసారని సమాచారం. ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రటీమ్  ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. కథ, తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆయన ఓకే అన్నారని, ఎగ్రిమెంట్ అయ్యాకనే ఎనౌన్సమెంట్ వస్తుందని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే సంజయ్ దత్..‘కేజీయఫ్‌ 2’, ‘లియో’లో సంజయ్‌ విలన్‌గా కనిపించారు. ఆయా చిత్రాలతో ఆయన తెలుగువారికీ చేరువయ్యారు. ప్రస్తుతం రామ్‌ నటిస్తోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

 అలాగే ఈ చిత్రం నిమిత్తం ఉత్తరాంధ్ర నుంచి ఏకంగా 400 మందిని తీసుకోనున్నారు.  ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సినిమా తెరకెక్కించనున్నారు. అలాగే రామ్ చరణ్ ఉత్తరాంధ్రకు చెందిన స్పోర్ట్స్ పర్శన్ గా కనిపించనున్నారు. అక్కడ స్లాంగ్ నే మాట్లాడనున్నారు. రంగస్దలం చిత్రం అచ్చమైన  గోదావరి యాసలో మాట్లాడిన ఆయన ఈ సినిమాలోనూ ఉత్తరాంధ్ర యాసతో ఆకట్టుకోనున్నారు. అందుకోసం రామ్ చరణ్ హోమ్ వర్క్ చేయబోతున్నారు. డైలాగులు విషయంలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ ప్రముఖ నవలా రచయిత సాయిం చేస్తున్నట్లు వినికిడి. ఏప్రియల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.

స్పోర్ట్స్‌ డ్రామాగా... గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్‌ కనిపించనున్నారు. శివరాజ్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  అలాగే  ఈ  సినిమాలో సీనియర్ నటి లయ కూడా నటించనుంది. ఇక ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
 
 రంగస్దలం ను మించిన మేకోవర్ తో ఫిల్మ్ తెరకెక్కించబోతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం.  ఇతర నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట.   పూర్తి వివరాలను బుచ్చిబాబు అండ్ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట సతీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.   

click me!