హీరోయిన్లను మార్చడం, రీ షూట్ వెనక అసలు కథ ఇదే.. దర్శకుడు మల్లిక్ రామ్ షాకింగ్ కామెంట్స్

By Nuthi SrikanthFirst Published Mar 21, 2024, 4:51 PM IST
Highlights

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). ఈనెలలో విడుదల కాబోతుండటంతో సినిమా గురించి దర్శకుడు మల్లిక్ రామ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

తెలుగు ఆడియెన్స్, ముఖ్యంగా యువతలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిత్రాల్లో 'డీజే టిల్లు' (Dj Tillu) ఒకటి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రధాన పాత్రలో అలరించిన విషయం తెలిసిందే. తెలంగాణ యాస, భాష, అటిట్యూడ్ తో సిద్ధూ ఎలా ఆకట్టుకున్నాడో తెలిసిందే. ముఖ్యంగా సిద్ధూ బాడీ లాంగ్వేజీ, డైలాగ్స్ అప్పట్లో సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

ఈ చిత్రాన్ని యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రస్తుతం సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మార్చి 29న ఈ మూవీ విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీమ్. ఈ క్రమంలో దర్శకుడు మల్లిక్ రామ్ (Mallik Ram) ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమాకు ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు మారడం, సంగీత దర్శకుడు, దర్శకుడు మారడం, రీషూట్ కు వెళ్లడంపై ప్రస్తుత దర్శకుడు మల్లిక్ ఆసక్తికరంగా క్లారిటీ ఇచ్చారు. 

తాజాగా  దర్శకుడు మల్లిక్ రామ్ మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు. ముందుగా సినిమాలో సిద్ధు ప్రమేయంపై దర్శకుడు స్పందించారు. ’సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు 'టిల్లు స్క్వేర్' చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు. ఇక బయట ఏవో కొన్ని వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు.’ అని క్లారిటీ ఇచ్చారు. 

అలాగే హీరోయిన్ల మార్పులపైనా ఇలా స్పందించారు. ‘అనుపమ గొప్ప నటి. ఈ సినిమాలో లిల్లీ పాత్ర ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. అనుపమని బోల్డ్ గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి ఆమె న్యాయం చేయగలదని నమ్మాం. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసిందన్నారు.’ ఇక ఈ సినిమాలో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉన్నాయనే నెపంతో మడోనా, మీనాక్షి చౌదరి, శ్రీలీలా వంటి వారు నో చెప్పారని రూమర్లు వినిపించాయి. దీనిపై తాజాగా మల్లిక్ రామ్ ఇలా క్లారిటీ ఇచ్చారు. 

ఇక రీ షూట్ కి వెళ్ళడానికి కారణం ఏంటో కూడా తెలిపారు... ‘ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతుంటాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేశాం.’ అని తెలిపారు. 

ఇక యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)  కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‌ శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

click me!