సానియా మీర్జా బయోపిక్ కి రంగం సిద్ధం!

Published : Feb 09, 2019, 12:09 PM IST
సానియా మీర్జా బయోపిక్ కి రంగం సిద్ధం!

సారాంశం

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో మేరీకోమ్, మిల్కాసింగ్, ధోనీ, మహావీర్ సింగ్(దంగల్)ల జీవితాలు బయోపిక్ లుగా వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. 

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో మేరీకోమ్, మిల్కాసింగ్, ధోనీ, మహావీర్ సింగ్(దంగల్)ల జీవితాలు బయోపిక్ లుగా వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఇప్పుడు భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా బయోపిక్ కూడా తెరపైకి రానుంది.

గత కొంత కాలంగా ఆమె బయోపిక్ పై వస్తోన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. బయోపిక్ కి సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం చేసినట్లు సానియా మీర్జా శుక్రవారం నాడు వెల్లడింది. చాలా కాలంగా తన బయోపిక్ పై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికి కుదిరిందని చెప్పింది. 

ఇది తన స్టోరీ కాబట్టి ఇన్‌పుట్స్‌ చాలా కీలకమని ఇంకా సినిమా ప్రారంభ దశలోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. సినిమా కాస్టింగ్, టెక్నికల్ టీమ్ ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరస్పర అంగీకారంతో ముందుకు వెళతామని అన్నారు. ఈ బయోపిక్ ని బాలీవుడ్ దర్శకనిర్మాత రోనీ స్క్రూవాలా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Border 2 collections: బార్డర్ 2 ఫస్ట్ డే వసూళ్లు, `ధురంధర్‌` రికార్డు బ్రేక్‌.. సన్నీ డియోల్ మూవీ కలెక్షన్ల సునామీ