సమంత నిర్మించిన శుభం మూవీ నుంచి, ఫస్ట్ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్, ఎలా ఉందంటే?

నిర్మాతగా తొలి అడుగు వేసింది స్టార్ హీరోయిన్ సమంత. దాదాపు ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉన్న శామ్, రీ ఎంట్రీలో సరికొత్త జోష్ చూపిస్తోంది. నటిగా  మాత్రమే కాకుండా..నిర్మాతగా కూడా కొత్త  జీవితం స్టార్ట్ చేసింది. ఇక తాజాగా సమంత నిర్మిస్తున్న సినిమా నుంచి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్  అయ్యింది. 
 

Google News Follow Us

టాలీవుడ్ స్టార్ హీరోయిన్  సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత చేస్తున్న ఫస్ట్ సినిమా శుభం.  ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

ఈసినిమా నుంచి టైమ్ టు టైమ్ అప్ డేట్స్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు టీమ్. ఈ క్రమంలో ఇప్పటికే  రిలీజ్ చేసిన ‘శుభం’ ట్రైలర్‌ కు  అద్భుతమైన  స్పందన వచ్చింది.  రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో  మేకర్స్ ప్రమోషన్స్ ను స్పీడ్ చేశారు.  ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మొదటి సింగిల్ ‘జన్మ జన్మల బంధం’సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించి ఓ ఎనర్జిటిక్ రీమిక్స్ పాట. నిర్మాత సమంతతో  పాటు ప్రధాన తారాగణం ఈ ప్రమోషనల్ సాంగ్‌లో కనిపిస్తారు. ఈ సాంగ్‌లో సమంత అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నారు. టీం అంతా కూడా ఫుల్ వైబ్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రమోషనల్ సాంగ్ బీట్ కు అందరు  హుషారుగా డాన్స్ చేస్తూ కనిపించారు. 

నవ్వు, భయం , థ్రిల్లింగ్ , ఎమోషన్స్‌, ఇలా అన్ని ఎలిమెంట్స్  ‘శుభం’లో పొందు పర్చారని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ వంటి వారు నటించారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది ‘శుభం’ 

Read more Articles on