కోలివుడ్ హాట్ టాపిక్: రాజకీయాల్లోకి సమంత..?

By Udaya DFirst Published Feb 9, 2019, 10:26 AM IST
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తమిళంలో కూడా సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. ఇప్పుడు సమంత రాజకీయాల్లోకి రాబోతుందంటూ కోలివుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తమిళంలో కూడా సినిమాలు చేస్తూ అక్కడ బిజీ హీరోయిన్ గా గడుపుతోంది. ఇప్పుడు సమంత రాజకీయాల్లోకి రాబోతుందంటూ కోలివుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి రియల్ పాలిటిక్స్ కాదు.. రీల్ పాలిటిక్స్ అని తెలుస్తోంది. 

కోలివుడ్ లో పొలిటికల్ ఫాంటసీ సినిమా 'తుగ్లక్ దర్బార్' తెరకెక్కనుంది. సీరియస్ పాలిటిక్స్ గా కాకుండా.. పొలిటికల్ ఫాంటసీగా సినిమాను రూపొందించనున్నారు. నూతన దర్శకుడు ప్రసాద్ దీనదయాళ్ అనే వ్యక్తి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో లలిత్ కుమార్ నిర్మించబోతున్నారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నాడు. ఇప్పుడిప్పుడే విజయ్ కి తెలుగులో క్రేజ్ పెరుగుతోంది. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాడు నిర్మాత. ఈ మేరకు హీరోయిన్ గా సమంతను తీసుకుంటే మరింత కలిసొస్తుందని ప్లాన్ చేస్తున్నాడు.

ఆ కారణంగానే సమంతను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంత కలిసి 'సూపర్ డీలక్స్' అనే సినిమాలో నటిస్తున్నారు. మరి మరోసారి ఈ జంట కలిసి నటిస్తారో.. లేదో.. చూడాలి!

click me!