బ్లాక్ బికినీలో సమంత.. వైరల్ అవుతున్న ఫోటో!

Published : May 08, 2019, 12:43 PM IST
బ్లాక్ బికినీలో సమంత.. వైరల్ అవుతున్న ఫోటో!

సారాంశం

టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు. అక్కడ ఈ జంట హాలీడే ఎంజాయ్ చేస్తుంది. 

టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు. అక్కడ ఈ జంట హాలీడే ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల 'మజిలీ' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ కపుల్ కొద్దిరోజులుగా సరదాగా దేశాలు చుడుతోంది. 

ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉన్నారు. అక్కడ ప్రముఖ చెఫ్ డానీ గార్సియాకు చెందిన రెస్టారంట్ ముందు జంటగా తీసుకున్న ఫోటోని చైతు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇది ఇలా ఉండగా.. సమంత తన స్టేటస్ లో ఓ ఫోటో పెట్టింది.

అందులో నాగ చైతన్య, సమంత పొట్టి బట్టల్లో మెరిసిపోతున్నారు. ఇద్దరూ పడక కుర్చీల్లో సేదతీరుతున్నారు. సమంత బ్లాక్ కలర్ బికినీ వేసుకొని కనిపించింది. ఈ ఫోటోపై 'ఐలవ్యూ 3000' అని రాసింది. 'అవెంజర్స్' సినిమాలో ఐలవ్యూ 3000అనే డైలాగ్ ఆకట్టుకుంది.

ఇప్పుడు సమంత కూడా ఆ డైలాగ్ వాదేసింది. ఇలా ఈ ఫోటోకి విపరీతమైన స్పందన వస్తోంది. కొందరు మాత్రం ఇకనైనా ఇలాంటి బట్టలు వేసుకోవడం మానేయాలని సమంతకి క్లాస్ పీకుతున్నారు.  
 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా