Samantha: ఫస్ట్ బిజినెస్‌ ఫెయిల్యూర్ ఎప్పుడు జరిగింది? సమంత అసలైన గురువు ఎవరో తెలుసా?

Published : Nov 11, 2026, 05:05 PM IST
Samantha

సారాంశం

నటి సమంత తన బిజినెస్ జర్నీ గురించి మనసు విప్పి మాట్లాడారు. మొదటి బిజినెస్‌లో ఎదురైన వైఫల్యం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని చెప్పిన ఆమె, ప్రస్తుతం చాలా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.

సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమంత, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. వెండితెరపై విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ, తెరవెనుక బిజినెస్‌ ఉమెన్‌గా కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తన బిజినెస్ జర్నీ గురించి మాట్లాడిన సమంత, జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్సే పెద్ద పాఠాలు నేర్పించాయన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అంతేకాదు, మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా తాను పెడుతున్న పెట్టుబడుల గురించి కూడా మాట్లాడారు.

ఓటమి నేర్పిన పాఠమే పెద్ద ఆస్తి 

నటిగా ఎంతో సక్సెస్ చూసిన సమంత, వ్యాపార రంగంలో అడుగుపెట్టినప్పుడు అంతా అనుకున్నట్లు జరగలేదట. ఇటీవల 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన బిజినెస్ అనుభవాలను పంచుకున్నారు. తన మొదటి బిజినెస్ పార్టనర్‌షిప్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పిన సమంత, మొదట్లోనే కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు.

అయితే ఆ అనుభవాన్ని ఓటమిగా భావించకుండా, దాని నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. సక్సెస్ సంతోషాన్ని ఇవ్వొచ్చు.. కానీ ఫెయిల్యూర్స్ మన తప్పులను అర్థం చేసుకోవడానికి, తదుపరి అడుగులు జాగ్రత్తగా వేయడానికి సాయపడతాయన్నది సమంత అభిప్రాయం. మొదటి బిజినెస్‌లో ఎదురైన అనుభవమే ఆ తర్వాత పెట్టుబడి నిర్ణయాలను మరింత బాధ్యతాయుతంగా తీసుకునేలా చేసిందని ఆమె వివరించారు.

10 కంపెనీల్లో పెట్టుబడులు

సమంత బిజినెస్ జర్నీలో మరో విశేషం ఏంటంటే మహిళా పారిశ్రామికవేత్తలకు ఆమె ఇస్తున్న ప్రోత్సాహం. ప్రస్తుతం సుమారు 10 విభిన్న స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమంత వెల్లడించారు. వీటిలో సుమారు 8 కంపెనీలను మహిళలే నడిపిస్తుండటం తనకు గర్వకారణమని ఆమె చెప్పారు. సొంత కష్టం, సామర్థ్యంతో వ్యాపారాలను నిర్మిస్తున్న మహిళలతో కలిసి పనిచేయడం తనకు కొత్త అనుభూతిని, సంతృప్తిని ఇచ్చిందన్నారు.

వ్యాపార రంగంలో మహిళలు పెట్టుబడి పెట్టడానికి లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి వెనకాడకూడదని ఆమె సూచించారు. రిస్క్ తీసుకోకుండా ఏ రంగంలోనూ పెద్ద స్థాయి సాధన సాధ్యం కాదన్న సందేశాన్ని కూడా ఇచ్చారు. మహిళలు తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచి వ్యాపార రంగంలోకి రావాలన్నది సమంత ఆకాంక్ష.

నటన మాత్రమే కాదు, బిజినెస్‌లోనూ సమంత కొత్త అడుగు!

సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న సమంత, బిజినెస్‌పైనా ఆసక్తి చూపడం విశేషం. తొలి ప్రయత్నంలో ఎదురైన పరాజయం నుంచే పాఠాలు నేర్చుకుని, ఇప్పుడు పలు స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్న ఆమె జర్నీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారం, పెట్టుబడులు... ఇలా పలు బాధ్యతలను మోస్తున్న సమంత, మహిళా పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చే మాటలను పంచుకున్నారు. సక్సెస్ వెనుక ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయన్నది తన అనుభవం ద్వారా మరోసారి గుర్తుచేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: 515 రోజులు ఆడిన మూవీ, చిరంజీవి సినిమాతో కుంభస్థలం బద్దలు కొట్టిన నటుడు.. ఇంటర్వెల్‌కే‌ స్టార్‌
Anirudh Marriage: గ్రాండ్ గా అనిరుధ్, కావ్య మారన్ వివాహం, గ్రీస్‌లో అంగరంగ వైభవంగా వేడుక!