సమంత ఏం మాయ చేసిందో...

Published : Oct 19, 2016, 05:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
సమంత ఏం మాయ చేసిందో...

సారాంశం

మొదటి సినిమాతోనే తొలిప్రేమ కొడుకు ప్రేమను అంగీకరించిన నాగ్? త్వరలోనే చైతూ సమంతల పెళ్లి వేడుక

నాగార్జున అమలను పెళ్లాడిన సంగతి మనందరికీ తెలుసు. ఇప్పుడు నాగ్ తనయుడు చైతూ కూడా ఓ హీరోయిన్-ను పెళ్లాడబోతున్నాడని అంతటా టాక్ నడుస్తోంది. అందుకు చాలా  ఆధారాలు కూడా దొరికాయి. ప్రైవేట్ ఈవెంట్స్-లో చైతూ-సమంత కలిసి కనిపిస్తున్నారు. అంతేకాదు.. తండ్రి నాగార్జున కూడా అదే సీన్లో దర్శనమిస్తున్నాడు..అంటే.. కొడుకు ప్రేమను తండ్రి అంగీకరించినట్టేనని ప్రచారం మొదలైంది.

ఏం మాయచేశావే చిత్రంతో సమంతా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ లో తిరుగులేని తారగా.. వెలిగిపోతోంది. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పుకార్లు షికారు చేశాయి. అయితే.. చాలా కాలానికి ఆ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చింది. సమంత మత మార్పిడి చేసుకుని హిందూ మతాన్ని స్వీకరించింది. చైతూని పెళ్లాడటం కోసమే ఆ పని చేసిందని టాక్ వినిపించింది.

 

చైతూ-సమంత ఇద్దరూ వాళ్ల పెళ్లి విషయం బయటపెట్టకపోయినా... మేం పెళ్లి చేసుకోబోతున్నాం అన్న హింట్ మాత్రం ఇచ్చారు. చైతూ.. నేనో హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటున్నానని బహిరంగంగానే చెప్పాడు. అది సమంతనే అన్న విషయం అందరికీ తెలుసు. అతి త్వరలోనే ఈ ప్రేమ జంట ఎంగేజ్ మెంట్ జరగబోతోంది. అయితే.. ఆ వార్తను ఎవరు ముందుగా బయటపెడతారనేదే ప్రశ్న. కొడుకు ప్రేమను అంగీకరించాడు కాబట్టి నాగార్జునే స్వయంగా ప్రకటిస్తాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

మరి ఏం జరగబోతోందో.. పెళ్లి బాజాలు ఎప్పుడు మోగబోతున్నాయో వెయిట్ అండ్ సీ.

PREV
click me!

Recommended Stories

Mahesh Babu: `వారణాసి` కోసం మహేష్‌ బాబు సాహసం.. కెరీర్‌లోనే మొదటిసారి ఇలా.. తెలిస్తే గూస్‌ బంమ్స్
850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం