అమ్మో భయపెట్టేలా ఉన్న సమంత... ఫ్యామిలీ మాన్ 2 నుండి సమంత లుక్!

Published : Jan 13, 2021, 08:07 PM IST
అమ్మో భయపెట్టేలా ఉన్న సమంత... ఫ్యామిలీ మాన్ 2 నుండి సమంత లుక్!

సారాంశం

చుడిదార్ ధరించి ఉన్న సమంత చాలా సాదా సీదాగా డీగ్లామర్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఆమె చూపు మాత్రం చాలా సీరియస్ అండ్ డేంజరస్ గా ఉంది. సమంత లుక్ ఆమె పాత్రపై అంచనాలు మరింత పెంచేసింది. ఫ్యామిలీ మాన్ 2లో సమంత పాకిస్థాన్ కి చెందిన ముస్లిం యువతిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.

టాలీవుడ్ దివా  సమంత డిజిటల్ ఎంట్రీ  ఇస్తున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ క్రైమ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ కి కొనసాగింపుగా వస్తున్న ఫ్యామిలీ మాన్ 2లో సమంత ప్రధాన పాత్ర చేశారు. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ఫ్యామిలీ మాన్ 2 టీజర్ ని విడుదల చేయడంతో పాటు సమంత లుక్ రివీల్ చేయడం జరిగింది. 


అస్పష్టంగా టీజర్ చివర్లో సమంత కనిపించారు. చుడిదార్ ధరించి ఉన్న సమంత చాలా సాదా సీదాగా డీగ్లామర్ లుక్ లో దర్శనం ఇచ్చారు. ఆమె చూపు మాత్రం చాలా సీరియస్ అండ్ డేంజరస్ గా ఉంది. సమంత లుక్ ఆమె పాత్రపై అంచనాలు మరింత పెంచేసింది. ఫ్యామిలీ మాన్ 2లో సమంత పాకిస్థాన్ కి చెందిన ముస్లిం యువతిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయనే వాదన కూడా వినిపిస్తుంది. త్వరలోనే ఈ ఊహాగానాలకు తెరపడనుంది. 

ఇక టీజర్ లో మరో హీరోయిన్ ప్రియమణి గృహిణిగా కనిపించారు. ఫ్యామిలీ మాన్  సిరీస్ లో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన భార్యగా ప్రియమణి కనిపించనుందని సమాచారం. సమంత ఎంట్రీతో ఈ సిరీస్ కి మరింత హైప్ వచ్చి చేరింది. ఈ సారి తెలుగులో కూడా ఈ సిరీస్ సక్సెస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 
 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?