కాజల్ ను కాదని సమంతను సెట్ చేసుకున్నారట?

Published : Oct 16, 2018, 03:57 PM IST
కాజల్ ను కాదని సమంతను సెట్ చేసుకున్నారట?

సారాంశం

లేడి ఓరియెంటెడ్ సినిమాలకు ప్రస్తుతం మార్కెట్ బాగానే ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తే పోటీగా స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ హీరోయిన్స్ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి.

లేడి ఓరియెంటెడ్ సినిమాలకు ప్రస్తుతం మార్కెట్ బాగానే ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తే పోటీగా స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ హీరోయిన్స్ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. ప్రతి కథానాయిక తన కెరీర్ లో కొన్నైనా లేడి ఓరియెంటెడ్ సినిమాలను చేయాలనీ అనుకుంటుంది. ప్రస్తుతం ఆ స్థాయిలో పోటీ బాగా పెరిగింది. 

ఇకపోతే ఇటీవల కాజల్ అగర్వాల్ చేయాలనుకున్న ఒక కథను సమంత ఎగరేసుకుపోయిందని సమాచారం. రావణాసురిడి సోదరి శూర్పణఖ పాత్రను ప్రధానంగా చేసుకొని భార్గవ్ అనే యానిమేషన్ దర్శకుడు సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. రామాయణాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన శూర్పణఖ క్యారెక్టర్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మొదట కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. 

కథాచర్చలు కూడా ముగిసిన తరువాత మళ్ళి ఏం జరిగిందో ఏమో గాని సడన్ గా సమంత ను ఆ పాత్ర కోసం సెట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే యూ టర్న్ సినిమాతో లేడి ఓరియెంటెడ్ కథలతో మెప్పించగలనని నిరూపించుకున్న సమంత ఇప్పుడు శూర్పణఖ పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యింది. మరి కమర్షియల్ గా ఈ సినిమాతో ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Krishna: విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ తల్లి ఏం చేశారో తెలుసా..ఆమె చెప్పిన ఒక్క మాటతో
Nani: ఎన్టీఆర్ హీరోయిన్ పై కన్నేసిన నాని.. కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో మరో గోల్డెన్ ఛాన్స్..