ముప్పై ఏళ్లు బ్యాక్‌ వెళ్తున్న సమంత.. బాలీవుడ్‌ డెబ్యూ బ్యాక్ డ్రాప్ ఇదే..

Published : Oct 07, 2022, 08:45 PM IST
ముప్పై ఏళ్లు బ్యాక్‌ వెళ్తున్న సమంత.. బాలీవుడ్‌ డెబ్యూ బ్యాక్ డ్రాప్ ఇదే..

సారాంశం

సమంత త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె మొదటగా ఓ వెబ్‌సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

సమంత(Samantha) కనిపించక చాలా రోజులవుతుంది. కానీ ఆమె నటించే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా సమంత బాలీవుడ్‌ డెబ్యూ ప్రాజెక్ట్ కి సంబంధించిన సరికొత్త వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సమంత బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చేయబోతుంది. అమెరికన్‌ వెబ్‌ సిరీస్‌ `సిటాడెల్‌`(Citadel) ఆధారంగా హిందీలో వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. సమంతతోపాటు వరుణ్‌ ధావన్‌ కలిసి నటించనున్నారు. 

రుస్సో బ్రదర్స్ నిర్మించనున్న ఈ వెబ్‌ సిరీస్‌ని `ది ఫ్యామిలీ మ్యాన్‌` వెబ్‌ సిరీస్‌ మేకర్స్ రాజ్‌ డీకేలు రూపొందించనున్నారు. ఇందులో సమంత స్పై పాత్రలో కనిపించనుందట. యాక్షన్‌ అడ్వెంచరస్‌గా దీన్ని తెరకెక్కించనున్నారు. నవంబర్‌ చివర్లోగానీ, డిసెంబర్‌ మొదటి వారంలోగానీ ఈ వెబ్‌ సిరీస్‌ ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో నటించేందుకు సమంత యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించిన శిక్షణ తీసుకుంటుందని సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ వినిపిస్తుంది. ఇది 1990 బ్యాక్‌ డ్రాప్‌లో ఉండబోతుందట. ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లపోతున్నారట సమంత. దానికోసం సమంత, వరుణ్‌ ధావన్‌ ఇప్పటికే వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం సమంత చాలా శ్రమిస్తుందని సమాచారం. కఠినమైన వర్కౌట్లు చేస్తుందట. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఈ శిక్షణ తీసుకుంటుందని సమాచారం. ఇక ఈ సిరీస్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం కానుంది. 

ప్రస్తుతం సమంత `శాకుంతలం`, `యశోద` చిత్రాల్లో నటిస్తుంది. ఈ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు విజయ్‌ దేవరకొండతో `ఖుషి` చిత్రం చేస్తుంది. ఇవన్నీ పాన్‌ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?