స్క్రీన్ పై 60 ఏళ్ల సమంత.. అభిమానులు తట్టుకుంటారా?

Published : Sep 24, 2018, 03:59 PM IST
స్క్రీన్ పై  60 ఏళ్ల సమంత.. అభిమానులు తట్టుకుంటారా?

సారాంశం

 ఆ విషయంలో సమంత చాలా లక్కీ గర్ల్ అనే చెప్పాలి. అమ్మడు కెరీర్ మొదటి నుంచి మంచి గ్లామర్ తో ఆడియెన్స్ ని స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. రొటీన్ సినిమాలకు బిన్నంగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. రీసెంట్ గా ఆమె నుంచి వచ్చిన యూ టర్న్ సినిమా అందుకు ఉదాహరణ. 

స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఆ విషయంలో సమంత చాలా లక్కీ గర్ల్ అనే చెప్పాలి. అమ్మడు కెరీర్ మొదటి నుంచి మంచి గ్లామర్ తో ఆడియెన్స్ ని స్పెషల్ గా ఎట్రాక్ట్ చేస్తోంది. రొటీన్ సినిమాలకు బిన్నంగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. రీసెంట్ గా ఆమె నుంచి వచ్చిన యూ టర్న్ సినిమా అందుకు ఉదాహరణ. 

ఆ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగాను సమంతకి మంచి లాభాలనే ఇచ్చింది. ఇకపోతే మరో డిఫెరెంట్ లేడి ఓరియెంటెడ్ సినిమాలో కూడా అమ్మడు నటించడానికి సిద్దమైనట్లు సమాచారం. అసలు వివరాల్లోకి వెళితే.. మిస్ గ్రానీ అనే కొరియన్ మూవీ హక్కులను ఇటీవల ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దక్కించుకున్నట్లు సమాచారం. ఆ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు నందిని రెడ్డి తెరకెక్కించనున్నారట.

అయితే ఆ సినిమాలో సమంత 60 ఏళ్ల బామ్మగా కనిపించనుందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే అంత భారీ ఏజ్ లో సమంత దర్శనమిస్తే అభిమానులు తట్టుకుంటారా? అనేది సందేహమే. అయితే నటనాపరంగా కొత్తగా గుర్తింపు తెచ్చుకోవాలని సమంత ఆ ప్రయోగానికి ఒకే అన్నట్లు టాక్. అదే విధంగా 25 ఏళ్ల అమ్మాయిలా కూడా ఆ కథలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు క్యారెక్టర్స్ ని సమంత ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి.  

 

          

 

 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌