ముద్దు సీన్లు చస్తే చేయను.. ఎందుకంటే: సల్మాన్

Published : Jun 03, 2019, 01:22 PM IST
ముద్దు సీన్లు చస్తే చేయను.. ఎందుకంటే: సల్మాన్

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ 300 కోట్ల బిజినెస్ చేయకుండా ఉండదు. సినిమా సినిమాకు ఆ డోస్ పెంచుకుంటూ వెళుతోన్న కండల వీరుడు నటనలో పెద్దగా ప్రయోగాలు చేయలేడు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ 300 కోట్ల బిజినెస్ చేయకుండా ఉండదు. సినిమా సినిమాకు ఆ డోస్ పెంచుకుంటూ వెళుతోన్న కండల వీరుడు నటనలో పెద్దగా ప్రయోగాలు చేయలేడు. ఈ విషయాన్నీ చాలా సార్లు ఓపెన్ గా చెప్పిన సల్లు బాయ్ అదృష్టం కొద్దీ నా కథల ఎంపికల వల్ల సినిమాలు ఆడుతున్నాయని అన్నారు. 

అయితే ఇన్నేళ్ల ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా రొమాన్స్ సన్నివేశాల్లో సల్మాన్ డోస్ పెంచలేదు. అందుకు కారణం కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన సినిమాను చూసేందుకు చాలా మంది కుటుంబంతో కలిసి వస్తారు. ఆ విషయం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ముద్దు సీన్లు వస్తే ఒక్కసారిగా వారు ఫ్యామిలీ ముందు మొహం తిప్పేసుకుంటారు. ఆ ఒక్క సీన్ వారికి అసౌకర్యంగా అనిపిస్తుంది. 

ఫ్యామిలీ అంతా కలిసి నా సినిమా ఇబ్బంది లేకుండా చూడాలని నేను భావిస్తా,. అందుకే నేను లిప్ లాక్ వంటి సీన్స్ లో నటించనని దర్శకులకు చెప్పేస్తా. ప్రస్తుతం కిస్ సీన్స్ కామన్ అయినప్పటికీ ఎప్పటికి వాటి జోలికి వెళ్లనని సల్మాన్ తెలిపాడు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా