#Salaar:‘స‌లార్’ఇంగ్లీష్ డబ్బింగ్ , ఓ గమ్మత్తైన మేటర్

Published : Mar 24, 2023, 09:06 AM IST
  #Salaar:‘స‌లార్’ఇంగ్లీష్ డబ్బింగ్ , ఓ  గమ్మత్తైన మేటర్

సారాంశం

ఇప్పటికే సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఓ వైపు షూటింగ్, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్  కూడా జరుగుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.


  ప్ర‌భాస్ లిస్టులో ఉన్న చిత్రాల్లో ‘స‌లార్’ (Salaar) ఒక‌టి. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందుకు కార‌ణం.. ప్ర‌భాస్ ఒక‌టైతే.. మ‌రో కార‌ణం డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. కె.జి.య‌ఫ్ (KGF) చిత్రంతో రీసెంట్‌గా ఇండియ‌న్ సినిమా బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న ‘సలార్’ సినిమా అంటే మాస్ అండ్ ఫ్యాన్స్ ఆడియెన్స్ ట్రీట్ పక్కా ఉంటుందనడంలో డౌటే లేదు. ఈ క్రమంలో సలార్ గురించిన ఓ విషయం బయిటకు వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తోంది.

అదేమిటంటే సలార్ చిత్రాన్ని ఇండియన్ లాంగ్వేజ్ లతో పాటు ఇంగ్లీష్ వెర్షన్ డబ్బింగ్ రెడీ చేస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ వెర్షన్ కు మిగతా వెర్షన్స్ కు తేడా ఏమిటంటే...   #salaar ఇంగ్లీష్ డబ్బింగ్ లో  పాటలు, కామెడీ సీన్లు ఉండవు. దాంతో సినిమాలో అరగంట కన్నా ఎక్కువే లెంగ్త్ తక్కువ రానుందని సమాచారం.  !  
 
ఇక కే.జి.య‌ఫ్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ (Hombale Films) ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతీ హాస‌న్ (Shruti Haasan) ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. కన్నడలోని ఉగ్రమ్‌ సినిమాకు రీమేక్‌గా టాలీవుడ్‌లో  సలార్‌ సినిమా ఉంటుందని కూడా వార్తలని చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తోసిపుచ్చారు. ఇంకా మూడు నెలల్లో సలార్ షూటింగ్ పూర్తవుతుందని తెలిపారు.  సలార్ షూటింగ్ ఇంకా పెద్దగా ఏమీ లేదన్నారు. మరో 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ప్రశాంత్ నీల్ తెలిపారు. అంతేకాదు ఈ పెండింగ్‌ వర్క్‌ షూటింగ్‌ను సలార్‌ డైరెక్టర్‌ ప్రారంభించనున్నారు.

బాహుబ‌లి (Baahubali) చిత్రంతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు ప్ర‌భాస్‌. అప్పటి నుంచీ  వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌నే చేస్తూ వ‌స్తున్నారు. ఇటు సౌత్ లోనూ  అటు నార్త్ లోనూ అంద‌రి చూపు యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌పైనే ఉంది. ఇప్ప‌టికే స్టార్ హీరో చేసిన పాన్ ఇండియా సినిమాలు సాహో (saaho), రాధేశ్యామ్ (Rdhe Shyam) అంచనాలను  అందుకోలేక‌ చతికిలబడ్డాయి. దాంతో  ప్ర‌భాస్ అప్‌క‌మింగ్ మూవీస్ పై ప్రెజర్ బాగా ఉంది.  సెన్సేషన్ హిట్ కోసం  ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. 
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు