తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్ ముందుకు `సలార్‌`.. వచ్చేది అప్పుడే..

Published : Apr 14, 2024, 01:55 PM ISTUpdated : Apr 14, 2024, 01:56 PM IST
తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్ ముందుకు `సలార్‌`.. వచ్చేది అప్పుడే..

సారాంశం

`సలార్‌` థియేటర్లో దుమ్మురేపింది. భారీ వసూళల్ని రాబట్టింది. అంతేకాదు ఓటీటీలోనూ విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.   

ప్రభాస్‌ నటించిన `సలార్‌` చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది డిసెంబర్‌ 22న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ప్రభాస్‌ సోలోగా ఏడు వందల కోట్లు కొల్లగొట్టాడు. `డంకీ` మూవీ లేకపోతే వెయ్యి కోట్ల వరకు వెళ్లేది. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఈ చిత్రం ఓటీటీలో వచ్చింది. ఓటీటీలోనూ ఇది దుమ్ము రేపింది. అనేక రికార్డులను కొలగొట్టింది.

ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇంటిళ్లిపాదిని అలరించేందుకువస్తుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌ కి టైమ్‌ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 21న ఈ మూవీ టీవీలో సందడి చేయబోతుంది. వచ్చే ఆదివారం సాయంత్రం 5.30లకు స్టార్‌ మా లో టెలికాస్ట్ కానుంది. తాజాగా టీమ్‌ ఈవిషయాన్ని ప్రకటించింది. మరి థియేటర్లో దుమ్మురేపి, ఓటీటీలోనూ సత్తా చాటిని ఈ మూవీకి టీవీ ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూడాలి. 

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన `సలార్‌` చిత్రంలో ప్రభాస్‌ దేవా పాత్రలో నటించారు. శృతి హాసన్‌ హీరోయిన్‌గా కనిపించగా, వరధరాజా మన్నార్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించాడు. ఖాన్సార్‌ సామ్రాజ్యం ప్రధానంగా సాగే ఈ మూవీ ఆద్యంతం యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఆకట్టుకుంది. చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవా(ప్రభాస్‌), వరద(పృథ్వీరాజ్‌) ఖాన్సార్‌ లు చిన్నప్పుడే దూరమవుతున్నారు. 

పెద్దాయక వరధ ఆపదలో ఉన్నారని తెలిసి ఫ్రెండ్‌ కోరిక మేరకు మళ్లీ ఖాన్సార్‌కి వస్తాడు దేవా. తన రాజ్యంలోనే అధికారం కోసం కుట్ర జరిగిన నేపథ్యంలో వాళ్ల అంతుచూసి స్నేహితుడికి ఖాన్సార్‌ ని ఇచ్చేస్తాడు. మరి అంతటి స్నేహితులు ఎందుకు విడిపోయారు. ఇద్దరి మధ్య గొడవేంటి? ఖాన్సార్‌ ఏం జరిగింది? అనేది కథ. ఇది రెండో పార్ట్ లో చెప్పబోతున్నారు ప్రశాంత్‌నీల్‌. `సలార్‌ః సీజ్‌ ఫైర్‌`గా మొదటి పార్ట్ విడుదలైంది. ఇక రెండో పార్ట్ `సలార్‌ః శౌర్యంగ పర్వం`పేరుతో రాబోతుంది. త్వరలోనే ఈ రెండో పార్ట్ షూటింగ్‌ స్టార్ట్ కానుందట. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్