#Salaar ని డెవిల్ భయపెట్టిందా...భయపడిందా?

Published : Jan 01, 2024, 02:54 PM IST
 #Salaar ని డెవిల్ భయపెట్టిందా...భయపడిందా?

సారాంశం

పాన్‌ ఇండియా మూవీ సలార్‌ను ఢీకొట్టడానికి రంగంలోకి దూకిన మరో  పాన్‌ ఇండియా మూవీ డెవిల్.   సలార్ ఊపు తగ్గి కొన్ని చోట్ల  కొద్దిగా డ్రాప్ అయ్యినా  


‘కేజీయఫ్‌’లో నరాచీ ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ‘సలార్‌’తో ఖాన్సార్‌ వరల్డ్‌ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం.  దేవ- వరదరాజ మన్నార్‌ శత్రువులుగా మారడానికి కారణమేంటి?అని ఉత్సాహంగా చర్చించుకుంటూ థియేటర్స్ కు జనం వెళ్తున్నారు.. ఈ సినిమా సెకండ్ వీకెండ్ కూడా ఫినిష్ చేసుకుంది. ఈ నేఫధ్యంలో తెలుగులో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..డ్రాప్ ఉందా..ఈ వారం వచ్చిన డెవిల్, బబుల్ గమ్ ఏమయ్యాయో చూద్దాం.

ప్రభాస్  పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హసన్ కీలక పాత్రలు పోషించిన   సలార్ సినిమా తొలి భాగం ‘సలార్- సీజ్ ఫైర్’తెలుగు భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. అయితే ఫస్ట్ వీకెండ్ అవ్వగానే కొన్నిచోట్ల కలెక్షన్స్ డ్రాప్ స్టార్టైంది. అయితే సెకండ్ వీకెండ్ లో జనాలకు డెవిల్, బబుల్ గమ్ సినిమాలు తప్పించి ఆప్షన్ లేకపోవటంతో మళ్లీ సలార్ కు కలెక్షన్స్ పోటెత్తాయి. చాలా చోట్ల సలార్ హౌస్ ఫుల్స్ పడ్డాయి. 

న్యూ ఇయిర్ ని సలార్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ . మళ్లీ మళ్లీ చూసేవాళ్లు కొందరైతే ... న్యూ ఇయిర్ కొత్త సినిమా చూద్దామని ఫిక్సై డెవిల్ కు పెద్ద టాక్ లేకపోవటంతో సలార్ వైపు మ్రొగ్గు చూపేవారు మరికొందరు.  దాంతో 2023 హైయిస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా సలార్ తన స్దానం సంపాదించుకుంది. యుఎస్ భాక్సాపీస్ దగ్గర $9 మార్క్ ని రీచ్ అయ్యింది. 
   
ఏదైమైనా  #Salaar తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే రూ.178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ వీకెండ్ పూర్తి కాకముందే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.  కొద్దిగా డ్రాప్ అయ్యినా , ఈ వీక్ లో డెవిల్ తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేకపోవటంతో ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?