Devara Glimpse : ‘దేవర’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్... న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్

Published : Jan 01, 2024, 11:50 AM IST
Devara Glimpse :  ‘దేవర’ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్... న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్

సారాంశం

నూతన సంవత్సరం సందర్భంగా ‘దేవర’ Devara నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చింది. స్వయంగా తారకే అభిమానులకు గ్లింప్స్ రిలీజ్ డేట్ ను తెలియజేశారు. 

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ Jr NTR  ప్రస్తుతం భారీ యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ Devara లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ Koratala Siva  దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ నుంచి అభిమానులు సాలిడ్ అప్డేట్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక న్యూ ఇయర్ New Year 2024 సందర్భంగా అభిమానులకు మంచి అప్డేట్ అందించారు. 

మొన్నటి వరకు Devara Glimpse రిలీజ్ కాబోతుందనే బజ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా తాజాగా గ్లింప్ విడుదల తేదీని ప్రకటించారు. 2024 జనవరి 8న గ్లింప్స్ విడుదల కానుందని అధికారికంగా అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా ఓ కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఓడలో సముద్రపు మధ్యలో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ను చూడొచ్చు. ఆ వెనకే పదుల సంఖ్యలో యాచ్ లు కూడా ఎన్టీఆర్ ను ఫాలో అవుతూ ఉంటాయి. 

ఇప్పటికే ‘దేవర’ సినిమాపై కొరటాల శివ భారీ అంచనాలు పెంచేశారు. ఎన్టీఆర్ ను చూపించే తీరుకు వణుకుపుడుతందని చెప్పుకొచ్చారు. చావు భయం తెలియని క్రూరమైన మనుషులకు ‘దేవర’ భయంగా మారుతాడని ఆ మధ్యలో చెప్పారు. గతంలో వచ్చిన డైలాగ్ కూడా మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక గ్లింప్స్ ఏ స్థాయిలో ఉంటుందని అభిమానులు వేచి చూస్తున్నారు. 

‘దేవర’ నుంచి ఈ అప్డేట్ అందించడంతో పాటు తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపారు తారక్. ఈ నెల 8న ‘దేవర’ గ్లింప్స్ ను చూడబోతున్నారని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ఇక దేవర చిత్రం రెండు పార్టులు గా రానుంది. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కాబోతుందని ప్రకటించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం ఇస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌
Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌